TTD: ఆస్థాన మండపంలో స్వల్ప అగ్రిప్రమాదం

ABN , First Publish Date - 2023-04-16T21:55:58+05:30 IST

తిరుమల శ్రీవారి ఆలయం ముందున్న ఆస్థానమండపంలో ఆదివారం స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది. సాయంత్రం ఆస్థానమండపంలోని రెండో అంతస్తు నుంచి పొగ రావడాన్ని దుకాణదారులు గుర్తించారు.

TTD: ఆస్థాన మండపంలో స్వల్ప అగ్రిప్రమాదం

తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయం ముందున్న ఆస్థానమండపంలో ఆదివారం స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది. సాయంత్రం ఆస్థానమండపంలోని రెండో అంతస్తు నుంచి పొగ రావడాన్ని దుకాణదారులు గుర్తించారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. దాంతో ఫైర్‌ ఇంజిన్‌తో సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. పాడైపోయిన సోఫాలు, పరుపులు అగ్నిప్రమాదంలో కాలిపోయినట్టు గుర్తించారు. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. హోటళ్లు, దుకాణాల్లో పనిచేసే వ్యక్తులు అక్కడే నిద్రిస్తున్నారని, అటువంటి ద్వారా ఏమైనా జరిగిందా అనే కోణంలో విజిలెన్స్‌ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు ఆర్పడానికి నీటి పైపులను ఏర్పాటు చేసినప్పటికీ అందులో నీరు లేకపోవడంపై విమర్శలొచ్చాయి. స్ర్పింక్లర్లు కూడా సక్రమంగా పనిచేయడం లేదంటూ అక్కడి సిబ్బంది వాపోయారు. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది స్పందించడంతో అదృష్టవశాత్తూ భారీ ప్రమాదం తప్పింది.

Updated Date - 2023-04-16T21:55:58+05:30 IST