OHRK VV Lakshminarayana: బీఆర్‌ఎస్‌, వైసీపీ నుంచి ఆఫర్లు వచ్చాయ్‌!

ABN , First Publish Date - 2023-03-27T02:23:19+05:30 IST

బీఆర్‌ఎస్‌, వైసీపీల నుంచి తనకు ఆఫర్లు వచ్చాయని, తమ పార్టీల్లో చేరాలని ఇప్పటికీ కోరుతున్నారని, వచ్చే ఎన్నికల్లోనూ తాను విశాఖ నుంచే పోటీ చేస్తానని ప్రజల ఆదరణ తనకు ఉందని సీబీఐ మాజీ జాయింట్‌ డైరెక్టర్‌ వీవీ లక్ష్మీనారాయణ తెలిపారు.

OHRK VV Lakshminarayana: బీఆర్‌ఎస్‌, వైసీపీ నుంచి ఆఫర్లు వచ్చాయ్‌!

ఏ పార్టీలో చేరేదీ ఇంకా నిర్ణయించుకోలేదు

అభివృద్ధిపై హామీ ఇస్తే ఏ పార్టీలో అయినా చేరతా

లేకపోతే.. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతా

ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం కాదు

రాజకీయాల కోసం ఐపీఎస్‌ వదులుకోలేదు

‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’లో సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ

బీఆర్‌ఎస్‌, వైసీపీల నుంచి తనకు ఆఫర్లు వచ్చాయని, తమ పార్టీల్లో చేరాలని ఇప్పటికీ కోరుతున్నారని, వచ్చే ఎన్నికల్లోనూ తాను విశాఖ నుంచే పోటీ చేస్తానని ప్రజల ఆదరణ తనకు ఉందని సీబీఐ మాజీ జాయింట్‌ డైరెక్టర్‌ వీవీ లక్ష్మీనారాయణ తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం కాదని చెప్పారు. ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ నిర్వహించే ‘ఓపెన్‌హార్ట్‌ విత్‌ ఆర్కే’ కార్యక్రమంలో లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఆయన మనసులోని మాటల్లో కొన్ని ముఖ్యాంశాలు..

ఆర్కే: అసలు సర్వీసు వదిలి ఎందుకువచ్చారు?

లక్ష్మీనారాయణ: వాస్తవానికి నేను వీఆర్‌ ఎస్‌ తీసుకుని బయటరావడానికి కారణం వేరే ఉంది. హైదరాబాద్‌లో ఎన్‌ఐఆర్‌డీ సంస్థలో డిప్యూటీ డైరెక్టర్‌జ నరల్‌ పదవికి దరఖాస్తు చేశాను. అది వచ్చి ఉంటే రాజకీయాలవైపు వచ్చి ఉండేవాడిని కాదు. కానీ, ఆ ఉద్యోగం రాలేదు. అందుకే రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నా. ప్రస్తుతం 12 ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నా. రైతులను ఆర్గానిక్‌ వ్యవసాయం వైపు మళ్లిస్తూ ఒక కూటమిగా చేస్తున్నా.

ఆర్కే: విశాఖలో పోటీ చేశారు.. కానీ, తేడా వచ్చింది.

లక్ష్మీనారాయణ: లేదండీ.. నేను గెలిచాననే అనుకుంటున్నా. 2,88,754 మంది మార్పు కోరుకుంటున్నారనేది పాజిటివ్‌ ఫ్యాక్టర్‌. నిరాశలేదు. ఇప్పటికీ కోర్టులో వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌పై ఫైట్‌ చేస్తున్నా. ప్రజలు గెలిపించి ఉంటే అక్కడ కూర్చునేవాణ్ని. అలాగే ప్రత్యేక హోదా కోసం ఫైట్‌ చేయాలి. ఆ అంశం ముగిసిపోలేదు. కేంద్రం అనుకుంటే ప్రత్యేక హోదా ఇవ్వొచ్చు. మొన్నా మధ్య హిమాచల్‌ప్రదేశ్‌ వెళ్లాను. పారిశ్రామికంగా ఆ రాష్ట్రం చాలా డెవలప్‌ అయింది. వాళ్లకంటే కూడా హోదాతో ఏపీ వంటి రాష్ట్రాలు బాగా డెవలప్‌ అవుతాయి. ఎన్నికల విషయానికొస్తే సంస్కరణలు రావాల్సిన అవసరం ఉంది. ఉప ఎన్నిక పెట్టాల్సి వస్తే.. అక్కడ అప్పటికే సెకండ్‌ వచ్చినవారిని మిగిలిన కాలానికి ఎమ్మెల్యేను చేయాలి. ఇలాంటి సంస్కరణలు తీసుకురాగలిగితే ఏక వ్యక్తి వ్యవస్థ తగ్గుతుంది. ఓవర్‌నైట్‌ ఒక అధికారిని రిజైన్‌ చేయించేసి.. 24గంటల్లోనే ఎన్నికల కమిషనర్‌ను చేయడం కరెక్ట్‌ కాదు.

1mdsirABN07846.jpg

ఆర్కే: లిక్కర్‌ స్కామ్‌లో కవిత పాత్ర ఉందో లేదో.. ఎప్పటికి తేలుతుంది?

లక్ష్మీనారాయణ: ఇప్పుడు ఫైనల్‌గా అన్నీ కోర్టుకు చేరుతున్నాయి. అందుకే పెండింగ్‌ కేసులు పెరిగిపోయాయి. నిజానికి.. ప్రజాప్రతినిధులపై ఉన్న కేసులను ఏడాదిలోపే పరిష్కరించాలని సుప్రీం కోర్టు గైడ్‌లైన్స్‌ ఇచ్చింది. అయితే, రూల్స్‌ ఆఫ్‌ది గేమ్‌ చేంజ్‌ అవకుండా ఇది జరగదు. సీబీఐ తదితర వ్యవస్థలన్నింటినీ లోక్‌పాల్‌ కిందికి తీసుకురావాలి.

ఆర్కే: మీరు అరెస్టుచేసి జైలుకు పంపించిన వ్యక్తి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇలాంటివి చూసినప్పుడు.. ఏమనుకుంటారు?

లక్ష్మీనారాయణ: ప్రభావం చూపిస్తుంది. అయితే.. ఈ విషయాలన్నీ కూడా చేశారా.. లేదా.. అన్నది కోర్టులో తేలిపోతే.. బాగుంటుంది. దీనికి స్పీడ్‌ కావాలి. కొత్తకోర్టులు.. రోజువారీ విచారణ.. వంటివి చేయాలి.

ఆర్కే: మీరు.. మధ్యలో బీఆర్‌ఎ్‌సలో చేరతారనే ప్రచారం జరిగింది?

లక్ష్మీనారాయణ: నాయకులు నన్ను కలుస్తుంటారు. అడుగుతుంటారు. అడిగిన మాట వాస్తవం. మా తోట చంద్రశేఖర్‌, నేను ఒకే కేడర్‌. మిత్రులం. మహారాష్ట్రలో కలిసే పనిచేశాం. ఇద్దరం జనసేనలో ఉన్నాం. ఆయన ఇప్పుడు ఏపీ బీఆర్‌ఎస్‌ అధ్యక్షులు. అందుకే వచ్చేయొచ్చుకదా అని అడుగుతుంటారు. మాట్లాడిందైతే నిజం. ఆలోచిస్తున్నానని చెప్పాను.

ఆర్కే: బీఆర్‌ఎ్‌సతో పాటు వైసీపీ వాళ్లు కూడా అడిగారా?

లక్ష్మీనారాయణ: అడుగుతుంటారు. అప్పుడప్పుడు కలుస్తుంటారు. ఏముంది సర్‌.. రండి పార్టీలోకి అంటుంటారు. 2019లో కూడా రమ్మన్నారు.

1jdABN07613.jpg

ఆర్కే: వచ్చే ఎన్నికల్లో నిజంగా పోటీ చేయాలని ఉందా?

లక్ష్మీనారాయణ: చేస్తాను. కచ్చితంగా చేస్తాను. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధిపై కొన్ని ఐడియాలు ఉన్నాయి. వీటిపై డిస్కస్‌ చేస్తామని హామీ ఇస్తే.. పార్టీల్లో చేరతాను. అంతేతప్ప.. మామూలు మేనిఫెస్టోలు పెట్టి చేస్తామంటే.. స్వతంత్రంగానే పోటీ చేసేందుకు అవకాశం ఉంది.

ఆర్కే: అయితే.. ఇప్పుడు తేల్చుకోవాల్సింది పార్టీలే!

లక్ష్మీనారాయణ: ఔను.. ఇక్కడ వారి ఓటు బ్యాంకు కన్నా.. వ్యతిరేక ఓటు బ్యాంకు ఎంత అనేది లెక్కలు వేసుకుంటున్నారు. సో.. అప్పుడు ఏమైనా మార్పు రావొచ్చు.

ఆర్కే: ఓటర్లు మిమ్మల్ని ఆదరించకపోతే..

లక్ష్మీనారాయణ: ఇది.. కంటిన్యూ అవుతుంది. భగవద్గీత కూడా ఇదే చెబుతోంది. ప్రతి విషయం నుంచి ఏదో ఒకటి నేర్చుకోవచ్చు.

Updated Date - 2023-03-27T03:48:01+05:30 IST