Paritala Sunitha: సీఎం జగన్‌పై మాజీ మంత్రి పరిటాల సునీత కామెంట్స్

ABN , First Publish Date - 2023-07-05T17:55:44+05:30 IST

ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డిపై టీడీపీ నేత, మాజీ మంత్రి పరిటాల సునీత (Paritala Sunitha) విమర్శలు గుప్పించారు.

Paritala Sunitha: సీఎం జగన్‌పై మాజీ మంత్రి పరిటాల సునీత కామెంట్స్

కర్నూలు: ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డిపై టీడీపీ నేత, మాజీ మంత్రి పరిటాల సునీత (Paritala Sunitha) విమర్శలు గుప్పించారు. గతంలో చెన్నేకొత్తపల్లిలో సీఎం జగన్ (CM Jagan) బటన్ నొక్కారని ఇంత వరకు రైతుల ఖాతాల్లో పంట నష్ట పరిహారం డబ్బులు పడలేదని ఆమె మండిపడ్డారు. మళ్లీ ఇన్సూరెన్స్, ఇన్‌పుట్ సబ్సిడీ అందని రైతులు మళ్లీ అప్లై చేసుకోమని అధికారులు చెప్పారని, దరఖాస్తు చేసుకున్నా ఒక్క రూపాయి కూడా పడలేదని సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేవలం బత్తాయి పంటకే పరిహారం ఇస్తున్నారని, మిగతా పంటలకు ఇవ్వడం లేదని విమర్శించారు. అనంతపురం జిల్లాలో అత్యధికంగా వేరుశనగ, కంది సాగు అవుతుందని, చాలా మంది రైతులకు నష్టపరిహారం ఇవ్వలేదన్నారు. ఏ మొహం పెట్టుకుని జగన్ అనంతపురం జిల్లాకు వస్తున్నారని పరిటాల సునీత మండిపడ్డారు. చాలా మంది చిని రైతులకు నాలుగైదు లక్షలు పడ్డాయని, కానీ అధికారులు రెడ్ మార్క్ పెట్టారన్నారు.

టమోటా సాగుకు ఎకరాకు లక్ష రూపాయలు ఖర్చు అవుతుందని, కానీ వర్షాలకు నష్టపోయిన టమోటా రైతులకు ఎకరాకు రూ. 120 ఇచ్చారని విమర్శించారు. చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు కరువు ప్రాంతంగా ప్రకటించి పంట నష్ట పరిహారంతో పాటు వ్యవసాయ పనిముట్లు యంత్రాలు ఇచ్చారని పరిటాల సునీత గుర్తు చేశారు. చంద్రబాబు ప్రభుత్వమే రైతులకు రుణ మాఫీ చేసిందని, జగన్ పాలనలో రైతులకు ఎలాంటి న్యాయం జరగడం లేదని పరిటాల సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-07-05T20:23:12+05:30 IST