Yarapatineni Srinivas: తన తల్లిని అవమానించిన వారిని లోకేశ్ వదిలిపెట్టరు
ABN , First Publish Date - 2023-07-06T12:30:38+05:30 IST
పరిపాలన చేతగాని అసమర్థుడిని ముఖ్యమంత్రిని చేస్తే నాలుగేళ్లలో ప్రజలకు నరకం చూపించారని మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతులు, యువత, మహిళల రోదనవేదన ఎక్కువైందన్నారు. రైతులకన్నీళ్లు తుడిచి, యువత ఆశలకు జీవం పోసి, మహిళల వేదన తీర్చేది ఎప్పటికైనా చంద్రబాబు, టీడీపీ ప్రభుత్వమే అని చెప్పుకొచ్చారు.
అమరావతి: పరిపాలన చేతగాని అసమర్థుడిని ముఖ్యమంత్రిని చేస్తే నాలుగేళ్లలో ప్రజలకు నరకం చూపించారని మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు (Former MLA Yarapatineni Srinivas rao) వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతులు, యువత, మహిళల రోదనవేదన ఎక్కువైందన్నారు. రైతుల కన్నీళ్లు తుడిచి, యువత ఆశలకు జీవం పోసి, మహిళల వేదన తీర్చేది ఎప్పటికైనా చంద్రబాబు (TDP Chief Chandrababu naidu), టీడీపీ ప్రభుత్వమే (TDP Government) అని చెప్పుకొచ్చారు. జగన్ నొక్కే బటన్లకు ప్రజలు ఆశపడటం లేదని.. ఎన్నికల వేళ ప్రజలు నొక్కే బటన్‌తో జగన్ రెడ్డి శాశ్వతంగా రాష్ట్రం వదిలిపోతారన్నారు. తనతల్లిని అవమానించిన వారిని లోకేశ్ (TDP Leader Nara Lokesh) వదిలిపెట్టరని హెచ్చరించారు. లోకం తెలియనివాడని అవహేళన చేసిన లోకేశ్.. నేడు వైసీపీ ప్రభుత్వానికి (YCP Government) నిద్రలేకుండా చేస్తున్నారని ఆయన అన్నారు.
జగన్‌కు చదువు చెప్పిన గురువు కూడా తన శిష్యుడు ఇంత ఉన్మాదిలా తయారవుతాడని ఊహించి ఉండరన్నారు. విద్యార్థులకు విద్యను, యువతకు ఉపాధిని దూరం చేసిన సైకో.. వారిని గంజాయి, మాదకద్రవ్యాలకు బానిసల్ని చేసి, తన ఖజానా నింపుకుంటున్నారని విమర్శించారు. జగన్ పాలనలో పల్నాడులో జరిగిన దారుణాలు, రాయలసీమలో కూడా జరిగి ఉండవన్నారు. పట్టపగలే హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు, దొమ్మీలు జరుగుతున్నా ముఖ్యమంత్రి స్పందించరని.. ఎందుకంటే చేయిస్తున్నది ఆయనే కాబట్టి అని ఆరోపించారు. ఏపీ పోలీసులను అవమానించిన జగన్ రెడ్డి కోసం రాష్ట్ర పోలీస్ శాఖ ఎందుకు పనిచేస్తోందని ప్రశ్నించారు. తన అవసరం, స్వార్థం కోసం జగన్ రెడ్డి ఎవరినైనా బలి చేస్తారని... జగన్ రెడ్డి నవ్వు వెనక ఉండే విషాన్ని, దుర్మార్గపు ఆలోచనల్ని అధికారులు గ్రహించాలని హితవుపలికారు. జగన్ మెప్పుకోసం నిబంధనలు, చట్టాలకు అతీతంగా పనిచేసే అధికారులంతా టీడీపీ ప్రభుత్వంలో తగిన మూల్యం చెల్లించుకుంటారని యరపతినేని శ్రీనివాసరావు హెచ్చరించారు.