TTD: శ్రీవారికి బ్యాటరీ వాహన కానుక

ABN , First Publish Date - 2023-03-09T20:01:37+05:30 IST

తిరుమల వేంకటేశ్వరస్వామి (Tirumala Venkateswara Swamy)కి గురువారం ఓ బ్యాటరీ వాహనం కానుకగా అందింది. ఐడీబీఐ బ్యాంక్‌ చైర్మన్‌ రాకేష్‌శర్మ

TTD: శ్రీవారికి బ్యాటరీ వాహన కానుక

తిరుమల: తిరుమల వేంకటేశ్వరస్వామి (Tirumala Venkateswara Swamy)కి గురువారం ఓ బ్యాటరీ వాహనం కానుకగా అందింది. ఐడీబీఐ బ్యాంక్‌ చైర్మన్‌ రాకేష్‌శర్మ (Rakesh Sharma) రూ.7.67 లక్షల విలువైన 6సీట్ల బ్యాటరీ వాహనాన్ని అందజేశారు. గురువారం ఉదయం శ్రీవారి ఆలయం ముందు వాహనానికి పూజలు నిర్వహించిన అనంతరం టీటీడీ డిప్యూటీ ఈవో రమేష్‌బాబుకు తాళాలు అప్పగించారు. ఐడీబీఐ బ్యాంక్‌ (IDBI Bank) ప్రతినిధులు, తిరుమల ట్రాన్స్‌పోర్టు డీఐ జానకిరామరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

శ్రీవారి సేవలో సుప్రీం కోర్టు న్యాయమూర్తి

సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పంకజ్‌ మిథాల్‌ గురువారం తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో ఆలయంలోకి వెళ్లిన ఆయన ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకుని తర్వాత గర్భాలయంలోని మూలమూర్తిని దర్శించుకున్నారు. జస్టిస్‌ పంకజ్‌ మిథాల్‌ను రంగనాయక మండపంలో వేదపండితులు ఆశీర్వదించగా అధికారులు లడ్డూప్రసాదాలు అందజేశారు. అలాగే ముంబై హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ శేషాద్రి నాయుడు కూడా గురువారం శ్రీవారిని దర్శించుకున్నారు.

Updated Date - 2023-03-09T20:01:37+05:30 IST