Gorantla Butchaiah Chowdary : అవినీతి అక్రమాల పుట్ట.. క్యాన్సర్ గడ్డ
ABN , First Publish Date - 2023-10-04T13:41:26+05:30 IST
అవినీతి అక్రమాల పుట్ట.. క్యాన్సర్ గడ్డ ఏపీ సీఎం జగన్ అని.. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ఈ సందర్భంగా వేమన పద్యం వినిపించారు.
రాజమండ్రి : అవినీతి అక్రమాల పుట్ట.. క్యాన్సర్ గడ్డ ఏపీ సీఎం జగన్ అని.. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ఈ సందర్భంగా వేమన పద్యం వినిపించారు. భారత దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో ప్రతిపక్ష నేతలపై కేసులు పెట్టిన ఘనత జగన్‌దేనన్నారు. కోడికత్తి శ్రీను కేసులో జగన్ ఎందుకు సాక్ష్యం చెప్పటం లేదని గోరంట్ల ప్రశ్నించారు. ఏ నేరం చేయని చంద్రబాబుని అక్రమంగా జైలులో పెట్టారన్నారు. ప్రజాస్వామ్య హంతకుడుగా జగన్ మారారన్నారు. చివరికి న్యాయమే గెలుస్తుందన్నారు. పోలీసు వ్యవస్థ ను దుర్వినియోగం చేస్తున్నారన్నారు. తప్పుడు అధికారులపై ప్రజలు తిరగబడతారని బుచ్చయ్య చౌదరి అన్నారు.