JAGAN: కాసేపట్లో రేణిగుంట ఎయిర్‌పోర్టులో మోదీకి స్వాగతం పలకనున్న గవర్నర్, సీఎం జగన్
ABN , First Publish Date - 2023-11-26T18:54:48+05:30 IST
భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజులు తిరుపతిలో పర్యటించనున్నారు. ఇవాళ, రేపు తిరుపతి పర్యటన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీకి స్వాగతం పలకడానికి ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు.
తిరుపతి: భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజులు తిరుపతిలో పర్యటించనున్నారు. ఇవాళ, రేపు తిరుపతి పర్యటన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీకి స్వాగతం పలకడానికి ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు.
కాసేపట్లో ప్రధాని నరేంద్ర మోదీ రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. ఎయిర్‌పోర్టులో మోదీకి ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘన స్వాగతం పలకనున్నారు.