Gudivada Amarnath : రాయితీల విడుదలపై వస్తున్న నెగెటివ్ కథనాల వెనుక అసలు ఉద్దేశం ఇదే..
ABN , First Publish Date - 2023-02-25T13:33:03+05:30 IST
విశాఖపట్నంలో పెట్టుబడులు సదస్సు పెడుతుంటే.. ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెరిగుతుందని చూసి తట్టుకోలేని పత్రికలు తప్పుడు కథనాలు రాస్తున్నాయని మంత్రి గుడివాడ అమర్నాథ్ కామెంట్స్ విమర్శించారు.
విశాఖపట్నం : విశాఖపట్నంలో పెట్టుబడులు సదస్సు పెడుతుంటే.. ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెరిగుతుందని చూసి తట్టుకోలేని పత్రికలు తప్పుడు కథనాలు రాస్తున్నాయని మంత్రి గుడివాడ అమర్నాథ్ (Minister Gudivada Amarnath) కామెంట్స్ విమర్శించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ కారణంగా పారిశ్రామిక రాయితీలు ఆలస్యం అయ్యాయన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ (CM Jagan) ఆదేశాలు జారీ చేశారన్నారు. రాయితీల విడుదలపై వస్తున్న నెగెటివ్ కథనాల వెనుక అసలు ఉద్దేశం ప్రభుత్వ పాలనపై తప్పుడు సంకేతాలు పంపించాలనే దురుద్దేశం ఉందని అమర్నాథ్ విమర్శించారు.
ఐటీ సంస్థలకు 26 కోట్ల సబ్సిడీని ఇవ్వాల్సి ఉందని.. దానిని త్వరలోనే ఇచ్చేస్తామన్నారు. పెట్టుబడుల సదస్సుకు ప్రపంచస్థాయి దిగ్గజ సంస్థలు వస్తున్నాయన్నారు. ఆదానీ గ్రూప్ (Adani Group) పెట్టుబడులు పెడతామన్నారు కాబట్టి, భూములు ఇచ్చామని.. ఎవరొచ్చినా ఇస్తామన్నారు. వ్యాపారంలో ఒడిదుడుకులు సహజమన్నారు. ఒప్పందాలను అమలు చేసే సామర్ధ్యం ఉంటే ఆదాని పెట్టుబడులు కొనసాగుతాయన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలకు పవర్ హాలిడే ఉత్పన్నమయ్యే అవకాశం లేదని అమర్నాథ్ పేర్కొన్నారు. పారిశ్రామిక వేత్తలకు స్పష్టమైన హామీ ఇచ్చామన్నారు. విశాఖలో విప్రో కార్యకలాపాలు ఈ ఏడాది చివరి నాటికి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. ఇన్ఫోసిస్ తో కూడా మాటలు జరుగుతున్నాయని.. ఐటీ, స్టార్టప్స్ కోసం 3 లక్షల ఎస్ఎఫ్‌టీతో భవనం నిర్మాణం చేపడతామన్నారు. త్వరలోనే ఇండస్ట్రియల్ పాలసీ ప్రకటిస్తామని గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు.