Share News

AP High Court: కోర్టు ఆదేశాలు ధిక్కరణ.. గుంటూరు మున్సిపల్ కమిషనర్‌కు జైలు శిక్ష

ABN , First Publish Date - 2023-12-12T20:10:05+05:30 IST

AP High Court: గుంటూరు మున్సిపల్ కమిషనర్ కీర్తికి ఏపీ హైకోర్టు 30 రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. కోర్టు ఆదేశాలు ధిక్కరించారనే కారణంతో ఆమెకు న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. అంతేకాకుండా రూ.2వేల జరిమానా కూడా కట్టాలని ఆదేశాలు జారీ చేసింది.

AP High Court: కోర్టు ఆదేశాలు ధిక్కరణ.. గుంటూరు మున్సిపల్ కమిషనర్‌కు జైలు శిక్ష

గుంటూరు మున్సిపల్ కమిషనర్ కీర్తికి ఏపీ హైకోర్టు 30 రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. కోర్టు ఆదేశాలు ధిక్కరించారనే కారణంతో ఆమెకు న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. అంతేకాకుండా రూ.2వేల జరిమానా కూడా కట్టాలని ఆదేశాలు జారీ చేసింది. గుంటూరు కార్పొరేషన్ పరిధిలోని యడవలి వారి సత్రాన్ని అక్రమంగా ఆక్రమించుకొని ఎటువంటి లీజ్ చెల్లించకుండా స్కూల్‌ను నడుపుతున్నారంటూ గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు పిటిషనర్లకు రూ.25 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. అయితే ఈ ఆదేశాలను మున్సిపల్ కమిషనర్ కీర్తి పట్టించుకోలేదు.

ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాలను మున్సిపల్ కమిషనర్‌ అమలు చేయడంలేదంటూ పిటిషనర్‌ మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ధిక్కరణ వ్యాజ్యంపై మంగళవారం నాడు విచారణ చేపట్టిన హైకోర్టు.. మున్సిపల్ కమిషనర్‌ కీర్తికి నెల రోజుల జైలు శిక్ష, రూ.2వేల జరిమానా విధించింది. జనవరి 2న హైకోర్టు రిజిస్ట్రార్‌ వద్ద లొంగిపోవాలని హైకోర్టు న్యాయమూర్తి ఆదేశించారు.

Updated Date - 2023-12-12T20:10:06+05:30 IST