Guntur Dist.: అధికార మ‌దంతో వైసీపీ అరాచ‌కాలు

ABN , First Publish Date - 2023-06-09T15:19:47+05:30 IST

గుంటూరు జిల్లా: అధికార మ‌దంతో వైసీపీ నేతల అరాచ‌కాలు మితిమీరిపోతున్నాయి. గుంటూరు జిల్లాలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. వైసీపీ నాయకులు ప్రత్తిపాడు గ్రామంలోనే కాకుండా అధికారుల అండదండలతో ప్రక్క గ్రామాల చెరువులపై పడ్డారు.

Guntur Dist.: అధికార మ‌దంతో వైసీపీ అరాచ‌కాలు

గుంటూరు జిల్లా: అధికార మ‌దంతో వైసీపీ నేతల (YCP Leaders) అరాచ‌కాలు మితిమీరిపోతున్నాయి. గుంటూరు జిల్లాలో మట్టి మాఫియా (Mud Mafia) రెచ్చిపోతోంది. వైసీపీ నాయకులు ప్రత్తిపాడు గ్రామంలోనే కాకుండా అధికారుల అండదండలతో ప్రక్క గ్రామాల చెరువులపై పడ్డారు. గొట్టిపాడు గ్రామంలోని సర్వే నెం. 411లో ఉన్న చెరువులోని మట్టిని అక్రమంగా తవ్వేసి సొమ్ము చేసుకుంటున్నారు. మట్టి మాఫియా అరాచకాలపై పోలీసులు, అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

మరోవైపు వైసీపీపై బీజేపీ నేత సీఎం రమేష్ (CM Ramesh) సెటైర్లు వేశారు. 2014లో వైసీపీకి వచ్చిన సీట్లు కూడా 2024లో రావని చెప్పారు. ఏపీ ప్రజలు ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ప్రజలు ఆత్మాభిమానం లేకుండా జీవించేలా వైసీపీ పాలన (YCP Rule) సాగుతోందని రమేష్ అన్నారు. 2014 మళ్లీ రీపీట్ అవ్వాలని ఏపీ ప్రజలు ఆకాంక్షిస్తున్నారని చెప్పారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోరుకునేది నిజమయ్యే అవకాశాలు ఉన్నాయని వైసీపీకి అర్థమైందని అన్నారు. ఢిల్లీలో చంద్రబాబు, అమిత్ షా, నడ్డాను కలవడం వెనుక ఖచ్చితంగా రాజకీయ కారణాలు ఉన్నాయని సీఎం రమేష్ పేర్కొన్నారు.

Updated Date - 2023-06-09T15:19:47+05:30 IST