Chandrababu: 40 ఏళ్లల్లో ఎప్పుడూ చూడని అరాచకాలు చూశాను..

ABN , First Publish Date - 2023-03-22T14:22:48+05:30 IST

అమరావతి: మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయం (TDP Office)లో బుధవారం ఉగాది వేడుకలు (Ugadi Celebrations) ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu), నేతలు పాల్గొన్నారు.

Chandrababu: 40 ఏళ్లల్లో ఎప్పుడూ చూడని అరాచకాలు చూశాను..

అమరావతి: మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయం (TDP Office)లో బుధవారం ఉగాది వేడుకలు (Ugadi Celebrations) ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu), ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా వేద పండితులు పంచాంగ శ్రవణం వినిపించారు. ఈ ఏడాది సైకిల్‌ దూసుకెళ్తుందన్నారు. ప్రజల్లో నారా లోకేశ్‌ (Nara Lokesh)కు మంచి గుర్తింపు వస్తుందని, చంద్రుడు ఇంద్రుడై చక్రం తిప్పుతారన్నారు. ఏపీ (AP)లో ప్రధాన ప్రతిపక్షానికి ప్రజల్లో మంచి గుర్తింపు వస్తుందని, ప్రతిపక్షాలన్నీ ఏకమవుతాయని పంచాంగ శ్రవణంలో వెల్లడించారు.

అనంతరం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ వైసీపీ అరాచకాలను ప్రజలు తిప్పికొట్టారని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో (MLC Elections) టీడీపీకి ప్రజలు పట్టం కట్టారన్నారు. పదవుల్లో శాశ్వతంగా ఉండటానికి ఇది రాచరికం కాదని, ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రజాస్వామ్యం కోసం పోరాడుతామని, ప్రజా సంక్షేమమే టీడీపీ ధ్యేయమని స్పష్టం చేశారు.

నాలుగేళ్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కష్టాలే ఉన్నాయని, శోభకృత్ నామ సంవత్సరంలో శుభాలే జరుగుతాయని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీ ప్రజలకు వెలుగు రావడం ఖాయమన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు తిరుగుబాటు చేసి.. టీడీపీకి ఓట్లేశారన్నారు. అరాచకానికి కూడా ఓ పద్దతి.. ఓ విధానం ఉంటుందని.. కానీ గత 40 ఏళ్లల్లో ఎప్పుడూ చూడని అరాచకాలు చూశానని.. ప్రశ్నించిన పేదలపై దాడులు జరిగాయని అన్నారు. అధికార పార్టీ ఆశలు ఇక సాగవని పంచాంగంలో కూడా చెప్పారన్నారు.

మహిళలకు రక్షణ ఉండాలని.. ధరలు పెరిగాయి.. పన్నులు పెరిగాయి.. ప్రజలపై భారం పడిందని చంద్రబాబు అన్నారు. ధరలు పెరుగుదలపై రాజీ లేని పోరాటం చేస్తామన్నారు. పంచాంగం ఓ డెరెక్షన్ ఇస్తుంది.. సూచన ప్రాయంగా సంకేతాలిస్తుంది.. పంచాంగం ఎంతో శాస్త్రోక్తంగా రాస్తున్నారని.. అస్ట్రాలజీ కూడా సైన్సేనని.. ప్రజలు జాగ్రత్త పడడానికి పంచాంగం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. తెలుగు జాతి అనేక రంగాల్లో రాణిస్తోందని, నాలెడ్జ్ ఎకానమీలో తెలుగు వారి ప్రతిష్ట పెరిగిందన్నారు. ఉగాదికి.. టీడీపీకి దగ్గర సంబంధం ఉందని.. తెలుగు వారి కోసం తెలుగుదేశం పార్టీ అని చంద్రబాబు స్పష్టం చేశారు.

Updated Date - 2023-03-22T14:22:48+05:30 IST