Chandrababu: ఎరుకలకు న్యాయం చేసింది టీడీపీనే
ABN , First Publish Date - 2023-06-29T15:40:28+05:30 IST
ఏకలవ్యుడు అంటే గుర్తు వచ్చేది మహా భారతం. బొటనవేలును త్యాగం చేసిన వ్యక్తి ఏకలవ్యుడు. ఎరుకుల సామాజికవర్గానికి న్యాయం చేసింది టీడీపీనే. వైసీపీ ప్రభుత్వంలో పేదలకు అన్యాయం జరుగుతుంది. ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఎరుకుల కులస్తులకు న్యాయం చేస్తా
అమరావతి: టీడీపీ అధికారంలోకి వచ్చాక ఎరుకల సామాజికవర్గానికి న్యాయం చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) తెలిపారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏకలవ్య జయంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొని ఏకలవ్యుడి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. ‘‘ఏకలవ్యుడు అంటే గుర్తు వచ్చేది మహా భారతం. బొటనవేలును త్యాగం చేసిన వ్యక్తి ఏకలవ్యుడు. ఎరుకల సామాజికవర్గానికి న్యాయం చేసింది టీడీపీనే. వైసీపీ ప్రభుత్వంలో పేదలకు అన్యాయం జరుగుతుంది. ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఎరుకల కులస్తులకు న్యాయం చేస్తా.’’ అని చంద్రబాబు హామీ ఇచ్చారు.
ఏకలవ్యుడి చిత్రపటానికి లోకేష్ నివాళి
ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గంలో నారా లోకేష్ (Nara Lokesh) యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. పాదయాత్రలో భాగంగా కాకువారిపాలెం క్యాంప్ సైట్ నుంచి బయలుదేరే ముందు ఏకలవ్యుడి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నారా లోకేష్ పూలమాల వేసి నివాళులర్పించారు.