AP High Court: రాజధానిలో పాదయాత్ర చేసేందుకు శ్రావణ్‌కు గ్రీన్‌సిగ్నల్
ABN , First Publish Date - 2023-07-06T17:42:40+05:30 IST
ఈ నెల 8వ తేదీన రాజధానిలో పాదయాత్ర చేసేందుకు జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్‌కు హైకోర్టు అనుమతిచ్చింది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పాదయాత్ర చేసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 200 మందితో పాదయాత్ర చేసుకోవచ్చని న్యాయస్థానం స్పష్టం చేసింది. 200 మంది ఆధార్ కార్డులు పోలీసులకు ఇచ్చి అనుమతి తీసుకోవాలని ధర్మాసనం ఆదేశించింది.
అమరావతి: ఈ నెల 8వ తేదీన రాజధానిలో పాదయాత్ర చేసేందుకు జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్‌కు హైకోర్టు అనుమతిచ్చింది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పాదయాత్ర చేసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 200 మందితో పాదయాత్ర చేసుకోవచ్చని న్యాయస్థానం స్పష్టం చేసింది. 200 మంది ఆధార్ కార్డులు పోలీసులకు ఇచ్చి అనుమతి తీసుకోవాలని ధర్మాసనం ఆదేశించింది.
రాజధానిలో ఆర్-5 జోన్‌లో దళిత రైతులకు జరుగుతున్న అన్యాయంపై పాదయాత్ర చేసేందుకు శ్రవణ్ అనుమతి కోరారు. గత నెల 24వ తేదీన ప్రభుత్వం అనుమతిని తిరస్కరించింది. దీంతో ఈ నెల 8వ తేదీన పాదయాత్ర చేసేందుకు అనుమతి ఇవ్వాలని శ్రవణ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం.. తుళ్లూరులోని అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి రాజధానిలోని స్మృతివనం వరకూ పాదయాత్ర చేసుకునేందుకు అనుమతిచ్చింది. శ్రవణ్ పాదయాత్రపై ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. రాజధానిలో ఆర్-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణం జరుగుతుందని, అదే రోజు వైఎస్ జయంతి కూడా ఉందని ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉందని ప్రభుత్వం చెప్పింది. అనుమతి నిరాకరిస్తే ప్రాథమిక హక్కులకు భంగం కలిగించినట్టేనని శ్రవణ్ వాదించారు.