Nara Lokesh: అజయ్ రెడ్డి, సాక్షిపై లోకేష్ మరో న్యాయ పోరాటం..
ABN , First Publish Date - 2023-08-03T14:22:29+05:30 IST
అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్.. సాక్షి, అజయ్ రెడ్డిపై మరో న్యాయ పోరాటం చేస్తున్నారు. అసత్య కథనాలపై క్రిమినల్ కేసులు పెట్టారు. శుక్రవారం లోకేష్ మంగళగిరి కోర్టులో హాజరై వాంగ్మూలం ఇవ్వనున్నారు.
అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh).. సాక్షి (Sakshi), అజయ్ రెడ్డి (Ajayreddy)పై మరో న్యాయ పోరాటం చేస్తున్నారు. అసత్య కథనాలపై క్రిమినల్ కేసులు (Criminal Cases) పెట్టారు. శుక్రవారం లోకేష్ మంగళగిరి కోర్టు (Mangalagiri Court)లో హాజరై వాంగ్మూలం ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం నుంచి పాదయాత్రకు విరామం ఇవ్వనున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ (Skill Development)లో భారీ స్కామ్ (Big Scame) అని చైర్మన్ అజయ్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి లోకేష్‌పై ఆరోపణలు చేశారు. తనకు సంబంధం లేని అంశంతో చేసిన ఆరోపణలతో అజయ్ రెడ్డికి లోకేష్ నోటీసులు పంపించారు. దానికి సమాధానం లేకపోవడంతో పరువుకు భంగం కలిగించిన అజయ్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని మంగళగిరి కోర్టులో క్రిమినల్ కేసు దాఖలు చేశారు. అలాగే స్కిల్స్ స్కామ్ అంటూ సాక్షిలో వేసిన కథనంపై కూడా ఆ పత్రికకు లోకేష్ నోటీసులు పంపారు. పత్రిక ఎటువంటి వివరణ ఇవ్వకపోవడంతో ఆ పత్రికపై కూడా మంగళగిరి కోర్టులో క్రిమినల్ కేసు దాఖలు చేశారు. ఈ క్రమంలో శుక్రవారం వాంగ్మూలం ఇచ్చేందుకు లోకేష్ మంగళగిరి కోర్టులో ఉదయం 11 గంటలకు హాజరు కానున్నారు.