MLA Brahmanaidu: సమయం వచ్చినప్పుడు నేనేంటో చూపిస్తా..

ABN , First Publish Date - 2023-04-07T11:43:20+05:30 IST

పల్నాడు జిల్లా: వినుకొండ (Vinukonda) ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు (MLA Bolla Brahmanaidu) సంచలన వ్యాఖ్యలు (Sensational Comments) చేశారు.

MLA Brahmanaidu: సమయం వచ్చినప్పుడు నేనేంటో చూపిస్తా..

పల్నాడు జిల్లా: వినుకొండ (Vinukonda) ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు (MLA Bolla Brahmanaidu) సంచలన వ్యాఖ్యలు (Sensational Comments) చేశారు. వచ్చే ఎన్నికల్లో గెలిచేది తానేనని, తనపై పోటీ చేయడానికి భయపడేంతగా ఎన్నికలు ఉంటాయన్నారు. అన్నింటికి సిద్ధంగా ఉన్నానని, రేపు జరగబోయే ఎన్నికల్లంటివి గతంలో ఎవరూ చూసి ఉండరని అన్నారు. టీడీపీ నేతలు (TDP Leaders) తనను తక్కువ అంచనా వేస్తే సమయం వచ్చినప్పుడు తానేంటో చూపిస్తానని హెచ్చరించారు. ప్రాణం వదలడానికైనా తాను సిద్ధంగా ఉన్నానంటూ హాట్ కామెంట్స్ (Hot Comments) చేశారు.

వచ్చే ఎన్నికల్లో వైసీపీ (YCP) ఎలాంటి అరాచకాలు, అక్రమాలకు పాల్పడబోతుందో ముందుగానే పల్నాడు జిల్లా (Palnadu Dist.), వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తన కార్యకర్తలకు దిశ నిర్దేశం చేశారు. వచ్చే ఎన్నికల్లో వినుకొండ నుంచి తానే ఎమ్మెల్యేగా గెలవబోతున్నానని, గెలిచి తీరతానంటూ ఆయన స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో వినుకొండ నుంచి ప్రతిపక్షం పోటీ చేయాలంటే భయపడేస్థాయికి తీసుకువస్తానని, తన వ్యూహాలు ఎవరికీ అర్థంకావని అన్నారు. తాను ప్రాణత్యాగానికైనా సిద్ధపడతాను తప్పితే ఓడిపోయే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. కార్యకర్తలు కూడా పోరాటానికి సిద్ధంకావాలని ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వినుకొండ నియోజకవర్గంతోపాటు పల్నాడు జిల్లా వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి.

Updated Date - 2023-04-07T11:43:20+05:30 IST