Nadendla Manohar: ముందుగా మీ మంత్రులు, ఎమ్మెల్యేలకు పచ్చబొట్లు వేయించండి..
ABN , First Publish Date - 2023-02-14T15:59:24+05:30 IST
తెనాలి: ప్రచార ఆర్భాటాలకు పోయి వైసీపీ ప్రభుత్వం (YCP Govt.) ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తోందని జనసేనపార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) విమర్శించారు.
- ముఖ్యమంత్రికి పబ్లిసిటీ పిచ్చి పరాకాష్టకు చేరింది
- మా మొబైళ్ల మీద మీ స్టిక్కర్లు ఏంటి?
- వైసీపీ ప్రచారార్భాటాలకు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తారా?..
- సంక్షేమాన్ని గాలికి వదలి స్టిక్కర్లు అంటించుకుంటూ తిరుగుతున్నారు..
- ముందుగా అర్హులందరికీ సకాలంలో ఫించన్లు ఇవ్వండి..
- జనసేన పార్టీ కార్యకర్తలకు భద్రత-భరోసా కల్పించేందుకే క్రియాశీలక సభ్యత్వం
తెనాలి: ప్రచార ఆర్భాటాలకు పోయి వైసీపీ ప్రభుత్వం (YCP Govt.) ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తోందని జనసేనపార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) విమర్శించారు. మంగళవారం తెనాలిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పబ్లిసిటీ పిచ్చి పరాకాష్టకు చేరిందని, ముఖ్యమంత్రి తన ప్రచారం కోసం ఇంటింటికీ స్టిక్కర్లు అంటించాలని, మొబైళ్లపై సీఎం జగన్ (CM Jagan) ఫోటోలు వేయాలని ఆదేశించడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. ముఖ్యమంత్రి జగన్ ముందుగా తన మంత్రులు, ఎమ్మెల్యేలకు పచ్చబోట్లు వేయించి, ప్రజల్లోకి పంపాలని ఎద్దేవా చేశారు. ఆయనకు వారి మీద నమ్మకం లేదు కాబట్టి ‘మేము వైసీపీ వాళ్లం.. జగనన్నకు తోడుగా ఉంటాం.. ఆయనంటే మాకు భరోసా అన్న మాటలు చెప్పిస్తే బాగుంటుందని’ అన్నారు. ప్రజాస్వామ్యంలో బాధ్యతగల ముఖ్యమంత్రిగా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని.. అది వదిలేసి ఇంటింటికి స్టిక్కర్లు అంటించుకుంటూ తిరుగుతామంటే ఎలా? అని నాదేండ్ల మనోహర్ ప్రశ్నించారు.
నాడేంద్ల మనోహర్ మంగళవారం తెనాలి పట్టణ పరిధిలోని పలు వార్డుల్లో క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన శిబిరాల వద్ద పలువురికి క్రియాశీలక సభ్యత్వాలు ఇచ్చారు. అనంతరం ఇంటింటికి తిరుగుతూ.. సమస్యలు తెలుసుకుంటూ.. క్రియాశీలక సభ్యత్వ ఆవశ్యకతను స్వయంగా వివరించారు.