Guntur Dist.: కృష్ణానదిలో భారీగా బయటపడిన నాగ ప్రతిమలు
ABN , First Publish Date - 2023-06-26T10:38:46+05:30 IST
గుంటూరు జిల్లా: తాడేపల్లి మండలం, సీతానగరం కృష్ణానది ఎగువ భాగంలో భారీగా నాగ ప్రతిమలు బయటపడ్డాయి. అయితే ఇవి ఎక్కడ నుంచి వచ్చాయి ఎలా వచ్చాయి అనేది తెలియక స్థానికులు అయోమయంలో పడ్డారు.
గుంటూరు జిల్లా: తాడేపల్లి మండలం, సీతానగరం కృష్ణానది (Krishna River) ఎగువ భాగంలో భారీగా నాగ ప్రతిమలు (Naga Idols) బయటపడ్డాయి. అయితే ఇవి ఎక్కడ నుంచి వచ్చాయి ఎలా వచ్చాయి అనేది తెలియక స్థానికులు అయోమయంలో పడ్డారు. ఈ నాగ ప్రతిమలు ఈ కాలానికి చెందినివా? లేక ప్రాచీన కాలానికి చెందినవా? అని ఆరా తీస్తున్నారు. శిల్పులు చెక్కిన డ్యామేజ్ విగ్రహలు ఇక్కడ పడవేసారా? లేదా ఎక్కడైనా కూల్చివేత గుడుల విగ్రహాలు ఇక్కడ నదిలో వదిలి పెట్టారా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇలాంటి విగ్రహాలు ఎక్కడ పడితే అక్కడ పెడితే దోషాలు చుట్టు కుంటాయని, అందుకే ఇలా నదిలో విగ్రహలు వదలి వెల్లారని స్థానికులలో చర్చ జరుగుతోంది. ఈ విగ్రహాలు ఎప్పటివో తెలియాలంటే వీటిపై పరిశోధన జరగవలిసిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు. కృష్ణ నది లోతులలో మరిన్ని విగ్రహాలు వుండే అవకాశం వున్నట్లు ప్రచారం జరుగుతోంది. పూర్తి సమాచారం అందవలసి ఉంది.