Amaravati: మంగళగిరి కోర్టులో నారా లోకేశ్ వాంగ్మూలం
ABN , First Publish Date - 2023-08-04T14:28:04+05:30 IST
అమరావతి: తనపై అసత్య ప్రచారం చేసినవారిపై మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ న్యాయపోరాటం చేస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్లో భారీ స్కామ్ జరిగిందని మాజీ ఛైర్మన్ అజయ్ రెడ్డి చేసిన ఆరోపణలపై లోకేష్ పరువునష్టం దావా వేశారు.
అమరావతి: తనపై అసత్య ప్రచారం చేసినవారిపై మాజీ మంత్రి, టీడీపీ (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) న్యాయపోరాటం చేస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ (Skill Development)లో భారీ స్కామ్ (Big Scam) జరిగిందని మాజీ ఛైర్మన్ అజయ్ రెడ్డి (Ajay Reddy) చేసిన ఆరోపణలపై లోకేష్ పరువునష్టం దావా వేశారు. అలాగే అసత్య కథనాలు ప్రచురించిన సాక్షి పత్రిక (Sakshi Paper)పై కూడా క్రిమినల్ కేసులు (Criminal Cases) దాఖలు చేశారు. ఈ రెండు కేసులపై లోకేష్ శుక్రవారం మధ్యాహ్నం మంగళగిరి కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు.
అనంతరం లోకేష్ మీడియాతో మాట్లాడుతూ అసత్య ఆరోపణలపై న్యాయపోరాటం చేస్తానన్నారు. తమ కుటుంబంపై చేసిన ఆరోపణలపై కోర్టులో వాంగ్మూలం ఇచ్చానన్నారు. న్యాయం జరిగేంతవరకూ ఓపికతో పోరాడుతామని స్పష్టం చేశారు. తమపై తప్పుడు రాతలు రాయాలంటే ఎవరైనా భయపడాలన్నారు. తప్పుడు రాతలు రాస్తే వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు.
‘జగన్మోహన్ రెడ్డిది జైలు లైఫ్ అయితే.. నాది కాలేజ్ లైఫ్.. నాకు క్లాస్మేట్స్ ఉంటే.. జగన్కు జైల్మేట్స్ ఉన్నారు’ అంటూ నారా లోకేష్ వ్యాఖ్యానించారు. సీఎం తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని దోపిడీ చేస్తున్నారని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఆస్తులు వెల్లడించిన ఏకైక రాజకీయ కుటుంబం తమదని.. జగన్రెడ్డిలా తండ్రిని అడ్డుపెట్టుకుని అక్రమాస్తులు సంపాదించలేదని, దొంగ పేపర్, టీవీ ఛానెల్, పవర్ ప్లాంట్ పెట్టలేదని అన్నారు. పేదల పట్ల సీఎం జగన్కు ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని లోకేష్ విమర్శించారు.