Pattabhiram: వైసీపీ శ్రేణుల రాజకీయ జీవితం అయిపోయినట్లే..
ABN , First Publish Date - 2023-09-28T12:33:15+05:30 IST
అమరావతి: వైసీపీ శ్రేణుల రాజకీయ జీవితం అయిపోయినట్లేనని తెలుగుదేశం అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. గురువారం ఆయన మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ఇన్నర్ రింగ్ రోడ్‌పై ఫ్యాక్ట్ ప్రజంటేషన్ ఇచ్చారు.
అమరావతి: వైసీపీ (YCP) శ్రేణుల రాజకీయ జీవితం (Political Life) అయిపోయినట్లేనని తెలుగుదేశం అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ (Kommareddy Pattabhiram) అన్నారు. గురువారం ఆయన మంగళగిరి టీడీపీ కార్యాలయం (TDP Office)లో ఇన్నర్ రింగ్ రోడ్ (Inner Ring Road)పై ఫ్యాక్ట్ ప్రజంటేషన్ (Fact Presentation) ఇచ్చారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) కంతేరులో భూములు కొన్నారని వైసీపీ నేతలు (YCP Leaders) ఆరోపిస్తున్నారని, కొన్ని ప్రాంతాల్లో భూములు కొనాలని 2014 మార్చి 21న నిర్ణయించారన్నారు. 2014 మార్చి 21 నాటికి రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయా? అని ప్రశ్నించారు. మార్చి 21 నాటికి కాంగ్రెస్ ప్రభుత్వంలో కిరణ్ కుమార్ రెడ్డి (Kiran Kumar Reddy) సీఎంగా ఉన్నారని.. మార్చి 2014 నాటి తీర్మానాన్ని పేర్ని నాని (Perni Nani), సీఎం జగన్ (CM Jagan) ఒకసారి చూడాలన్నారు. రాజధాని ముందే ఊహించి కుట్రపూరితంగా భూములు కొన్నారంటున్నారని.. అప్పటికి ఎన్నికలే జరగలేదని.. ఏ ప్రభుత్వం వస్తుందో కూడా తెలియదని పట్టాభి వ్యాఖ్యానించారు.
హెరిటేజ్ సంస్థ విస్తరణ కోసం అనేక రాష్ట్రాల్లో భూసేకరణ చేస్తారని.. అదేవిధంగా ఆనాడు భూములు కొనాలని తీర్మానం చేసుకున్నారని పట్టాభిరామ్ తెలిపారు. దీనిపై ఎఫ్ఐఆర్ ఫైల్ కాగానే సీఐడీకి కూడా హెరిటేజ్ సంస్థ అన్ని వివరాలతో లేఖ రాసిందని పేర్కొన్నారు. ఆ లేఖ ద్వారా సీఐడీకి వాస్తవాలన్నీ హెరిటేజ్ సంస్థ ముందే ఇచ్చిందన్నారు. సీఐడీకి పంపిన తీర్మానం కాపీని ఎందుకు బయటపెట్టలేదని పట్టాభి ప్రశ్నించారు. బోర్డు మీటింగ్‌లో కంతేరులో 7.21 ఎకరాలు కొనుగోలుకు తీర్మానం చేశారని, 2014 జులై 1న కంతేరులో 7.21 ఎకరాలు కొనుగోలు చేశారన్నారు. జులై 31న మరికొంత భూమి కొనుగోలు చేశారని చెప్పారు.
లింగమనేని నుంచి కొన్న 4.55 ఎకరాలకు సంబంధించి లీగల్ ఇష్యూ ఉండడంతో రద్దు చేసుకున్నారని పట్టాభిరామ్ తెలిపారు. లీగల్ ఇష్యూ ఉండడంతో కోట్లు విలువచేసే భూమిని కూడా వదులుకున్నారన్నారు. ఆ ఒప్పందం రద్దుతో హెరిటేజ్‌కు మిగిలింది 9.67 ఎకరాలు మాత్రమేనని పట్టాభిరామ్ స్పష్టం చేశారు.