Pawan Kalyan: రూల్ ఆఫ్ లాను వైసీపీ విస్మరించింది..

ABN , First Publish Date - 2023-07-09T10:14:44+05:30 IST

అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పొత్తులపై క్లారిటీ ఇచ్చారు. సమగ్ర అధ్యయనం తర్వాతే పొత్తులపై నిర్ణయం తీసుకుంటామన్నారు. నిస్వార్ధంగా కష్టపడితే అధికారం దానంతటదే వస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

Pawan Kalyan: రూల్ ఆఫ్ లాను వైసీపీ విస్మరించింది..

అమరావతి: జనసేన అధినేత (Janasena Chief) పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పొత్తులపై క్లారిటీ (Clarity on Alliances) ఇచ్చారు. సమగ్ర అధ్యయనం తర్వాతే పొత్తులపై నిర్ణయం తీసుకుంటామన్నారు. నిస్వార్ధంగా కష్టపడితే అధికారం దానంతటదే వస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆదివారం మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ (YCP) అరాచక పాలనతో 70 శాతం ప్రజలు విసిగిపోయారన్నారు. రాష్ట్రానికి స్థిరత్వం తీసుకురావడమే జనసేన లక్ష్యమని, పొత్తుల గురించి ఆలోచించేందుకు సమయం ఉందని మీడియా ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఒంటరిగా వెళ్లాలా, కలసి వెళ్లాలా అనేది తరవాత మాట్లాడుకునే విషయమన్నారు. మండల స్థాయిలో సమగ్ర అధ్యయనం తర్వాతే పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. మనం బలంగా పని చేస్తే అధికారం దానంతట అదే వచ్చి తీరుతుందని, నాయకులు అందుకు అనుగుణంగా అడుగులు వేయాలన్నారు.

ఆదివారం నుంచి ప్రారంభం కాబోయే వారాహి (Varahi) విజయ యాత్ర మలి దశకు ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు అందించాలని పవన్ కల్యాణ్ కోరారు. రూల్ ఆఫ్ లా (Rule of Law)ను వైసీపీ విస్మరించిందని, ఆంధ్రప్రదేశ్‌లో రూల్ ఆఫ్ లా నాశనం అయిపోయిందని, ఏ పార్టీ అయినా రూల్ ఆఫ్ లాకి కట్టుబడి పని చేయాలని అన్నారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అనే అంశాన్ని అవివేకంతో మాట్లాడడం లేదని, జగన్ రెడ్డి (Jagan reddy), వైసీపీ నాయకులు వెళ్లే మార్గం తప్పు అని అన్నారు. వైసీపీ పాలనలో అవినీతి తారా స్థాయికి చేరిపోయిందని, వైసీపీ అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లో ప్రజలు రోడ్ల మీదకు రావాల్సి వచ్చిందన్నారు. వైసీపీని ఎన్నుకున్న వారం రోజుల్లోనే ప్రజలకు చేసిన తప్పు అర్ధం అయిపోయిందన్నారు. రాష్ట్రంలో గంజాయి విక్రయాలు పెరిగిపోయాయని, 30 వేల మంది అమ్మాయిలు మిస్సయ్యారని, ఈ అంశం మీద కనీసం రివ్యూ చేసే పరిస్థితులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది చాలా పెద్ద సమస్య. అయినా ఈ అంశం మీద కనీసం ఎవరూ మాట్లాడరని.. ఇలాంటి పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోలేకపోతే రాష్ట్రం అథోగతిపాలవుతుందన్నారు. రాష్ట్రానికి స్థిరత్వం తీసుకురావడమే వచ్చే ఎన్నికల తాలూకు ముఖ్య ఉద్దేశమని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.

Updated Date - 2023-07-09T10:14:44+05:30 IST