Palnadu Dist.: మళ్లీ పాదయాత్ర ప్రారంభించిన టీడీపీ నేత..
ABN , First Publish Date - 2023-10-08T08:51:27+05:30 IST
పల్నాడు జిల్లా: తెలుగుదేశం అధినేత చంద్రబాబు కోసం టీడీపీ కార్యకర్త చింతల నారాయణ మళ్లీ పాదయాత్ర ప్రారంభించారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా ఆయన పాదయాత్ర చేపట్టారు. నంద్యాల జిల్లా, చిన్న దేవులాపురం నుంచి రాజమహేంద్రవరానికి పాదయాత్ర చేపట్టారు.
పల్నాడు జిల్లా: తెలుగుదేశం అధినేత చంద్రబాబు కోసం టీడీపీ కార్యకర్త చింతల నారాయణ మళ్లీ పాదయాత్ర ప్రారంభించారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా ఆయన పాదయాత్ర చేపట్టారు. నంద్యాల జిల్లా, చిన్న దేవులాపురం నుంచి రాజమహేంద్రవరానికి పాదయాత్ర చేపట్టారు. ఈ నెల 5వ తేదీన వినుకొండ సమీపంలో వైసీపీ శ్రేణులు అతనిపై దాడి చేసి గాయపరిచారు. దీంతో ఆయన ఆస్పత్రిలో చికిత్స తర్వాత కోలుకున్న నారాయణ మళ్లీ పాదయాత్ర చేపట్టారు. శావల్యాపురంలో ఆయనను టీడీపీ నాయకులు సన్మానించారు.
కాగా పల్నాడు జిల్లా, వినుకొండ నియోజక వర్గంలో వైసీపీ అరాచకం బయటపడింది. టీడీపీ అధినేత చంద్రబాబు కోసం, భువనేశ్వరికి సంఘీభావం తెలిపేందుకు పాదయాత్రగా వస్తున్న వృద్ధుడిపై వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. నారాయణ (63) నంద్యాల జిల్లా, చిన్నదేవళాపురం నుంచి రాజమండ్రికి పాదయాత్రగా బయలుదేరారు. ఈ క్రమంలో వినుకొండ మండలం, విఠల్‌రాజ్ పల్లె వద్ద వృద్ధుడిపై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన నారాయణను టీడీపీ వర్గీయులు ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆస్పత్రికి చేరుకుని నారాయణను పరామర్శించారు.