AP News: తెనాలిలో మహిళపై మున్సిపల్ సిబ్బంది దాడి
ABN , First Publish Date - 2023-12-01T16:40:43+05:30 IST
తెనాలిలో మున్సిపల్ సిబ్బంది వేధింపులతో ఓ మహిళ రోడ్డున పడింది. నాదెండ్ల లక్ష్మీ అనే చిరు వ్యాపారి కుటుంబంపై మున్సిపల్ సిబ్బంది వేధింపులకు పాల్పడింది.
గుంటూరు: తెనాలిలో మున్సిపల్ సిబ్బంది వేధింపులతో ఓ మహిళ రోడ్డున పడింది. నాదెండ్ల లక్ష్మీ అనే చిరు వ్యాపారి కుటుంబంపై మున్సిపల్ సిబ్బంది వేధింపులకు పాల్పడింది. గత పదేళ్లుగా లక్ష్మీ రోడ్డు ప్రక్కన టిఫిన్ బండి నడుపుకుంటోంది. దాని మీదే జీవనోపాధి పొందుతోంది. తాజాగా బండి తీసేయాలని లక్ష్మీపై మున్సిపల్ సిబ్బంది ఒత్తిడి తీసుకొస్తోంది. ఈ నేపథ్యంలో టిఫిన్ బండిని బలవంతంగా తొలగించేశారు. వైసీపీ నేతలు తాడిబోయిన రమేష్, తాడిబోయిన రఘురాంలు వేధిస్తున్నారని లక్ష్మీ ఆవేదన వ్యక్తం చేసింది. లక్ష్మీ కుటుంబం రోడ్డుపై బైఠాయించి కన్నీటి పర్యాంతమైంది. గతంలో ఎప్పుడు ఇలాంటి వేధింపులు చూడలేదని వాపోయింది.