Share News

CBN: చంద్రబాబు ఆరోగ్యంపై హెల్త్‌ బులిటెన్ విడుదల

ABN , First Publish Date - 2023-10-29T20:14:12+05:30 IST

టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Nara Chandrababu Naidu) ఆరోగ్యంపై హెల్త్‌ బులిటెన్ (Health bulletin) విడుదల చేసినట్లు రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులు వెల్లడించారు.

CBN: చంద్రబాబు ఆరోగ్యంపై హెల్త్‌ బులిటెన్ విడుదల

రాజమండ్రి: టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Nara Chandrababu Naidu) ఆరోగ్యంపై హెల్త్‌ బులిటెన్ (Health bulletin) విడుదల చేసినట్లు రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులు వెల్లడించారు. చంద్రబాబుకు డాక్టర్ల బృందం 8 రకాల వైద్య పరీక్షలు చేసినట్లు జైలు అధికారులు తెలిపారు. వైద్య అధికారుల బృందం ఇచ్చిన వైద్య నివేదిక ప్రకారం ప్రస్తుతం చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని జైలు అధికారులు పేర్కొన్నారు. కానీ

చంద్రబాబు ఆరోగ్యం నిలకడగా ఉందని చెబుతూ ఆయన బరువును మాత్రం జైలు అధికారులు వెల్లడించలేదని టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

WhatsApp Image 2023-10-29 at 7.15.31 PM.jpeg

Updated Date - 2023-10-29T20:35:04+05:30 IST