-
-
Home » Andhra Pradesh » hearing on Chandrababu bail petition started in Vijayawad ACB court psnr
-
Chandrababu bail petition live updates: చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై విచారణ వాయిదా..
ABN , First Publish Date - 2023-10-04T11:59:31+05:30 IST
చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో వాదనలు వినిపించడానికి సిద్దమైన సుప్రీంకోర్టు న్యాయవాది ప్రమోద్ దూబే
Live News & Update
-
2023-10-04T17:05:00+05:30
ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా వేసిన ఏసీబీ కోర్ట్
ఇప్పటికే ఇరువురు న్యాయవాదులు వాదనలు విన్న న్యాయమూర్తి
రేపు 11.15 గంటలకు వింటానని చెప్పిన న్యాయమూర్తి
-
2023-10-04T16:35:00+05:30
పొన్నవోలు సుధాకర్ రెడ్డికి జడ్జి సూటిప్రశ్న
చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. కేబినెట్ నిర్ణయాన్ని చంద్రబాబుకు ఎలా ఆపాదిస్తారని ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డిని జడ్జి ప్రశ్నించారు. బెయిల్ ఇవ్వద్దని, కస్టడీకి అనుమతించాలంటూ సుధాకర్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. కేబినెట్ నిర్ణయం ప్రకారం జీవో ఇచ్చారు.. కానీ జీవోకు వ్యతిరేకంగా ఒప్పందం జరిగిందని పొన్నవోలు వాదించారు. సోషియో ఎకనామిక్ ఆఫెన్సుల్లో బెయిల్ ఇవ్వొద్దని సుప్రీం తీర్పులున్నాయంటూ ఉదహరించారు. స్కిల్ కేసులో ప్రతి అంశం, ప్రతి తప్పిదం చంద్రబాబు సూచనల మేరకే జరిగిందని పొన్నవోలు వాదించారు.
-
2023-10-04T16:18:00+05:30
పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలపై జడ్జి అసహనం.. కారణం ఏంటంటే..
ఏసీబీ కోర్టులో ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలపై న్యాయమూర్తి అభ్యంతరం వ్యక్తం చేశారు. చెప్పిన అంశాలను పదేపదే ఎందుకు చెబుతున్నారని న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. ‘‘ నేరానికి సంబంధించిన ఆధారాలు ఉంటే చూపించండి. రిమాండ్ రిపోర్ట్, కస్టడీ పిటిషన్‌ల సమయంలో చెప్పిన వాదనలే మళ్లీ చెబుతున్నారు. ఈడీ దర్యాప్తు చేసిందని, ఇన్‌కమ్ ట్యాక్స్ నోటీసు ఇచ్చిందని గతంలో చాలాసార్లు చెప్పారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో నిధుల దుర్వినియోగానికి సంబంధించిన ఆధారాలు ఉంటే ఇవ్వండి. చెప్పిందే చెబుతుంటే ఎన్నిసార్లు వింటాం’’ అని సీఐడీ తరపున వాదనలు వినిపిస్తున్న పొన్నవోలు సుధాకర్ రెడ్డిపై జడ్జి అసహనం వ్యక్తం చేశారు.
-
2023-10-04T15:37:00+05:30
ఏఏజీ పొన్నవోలు సుధాకర రెడ్డి వాదనలు
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో లభించిన అన్ని ఆధారాలు కోర్టు ఎదుట ఉంచాము. చంద్రబాబు పాత్ర ఉందని సీఐడీ గుర్తించిన అన్ని వివరాలను పరిశీలిస్తే అర్థమవుతుంది. చంద్రబాబు గురించి చెప్పడానికి స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో ఇదేమి ఫిక్షన్ స్టోరీ కాదు. కల్పిత పాత్ర కాదు. స్కామ్ జరిగిందని ఆధారాలు ఉన్నాయి, కాబట్టే మరింత లోతుగా విచారించేందుకు కస్టడీకిఇవ్వాలి. బెయిల్ ఇవ్వొద్దని కోరుతున్నాం’’ అని పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదించారు.
-
2023-10-04T15:15:00+05:30
చంద్రబాబు సాక్షులను ప్రభావితం చేస్తారు.. బెయిల్ ఇవ్వొద్దు: పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు
‘‘ చంద్రబాబు బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేయాలి. స్కిల్ కుంభకోణం దర్యాప్తు కీలక దశలో ఉంది. దర్యాప్తుకు కీలకంగా ఉన్న దశలో చంద్రబాబుకి బెయిల్ ఇవ్వడం సరికాదు. చంద్రబాబుకి బెయిల్ ఇస్తే సాక్షులని ప్రభావితం చేస్తారు. ఇప్పటికే చంద్రబాబు పీఏ పెండ్యాల శ్రీనివాస్, మనోజ్ పార్ధసాని విదేశాలకు పారిపోవడం వెనుక చంద్రబాబు హస్తం ఉంది. స్కిల్ కుంభకోణంలో రూ.270 కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైంది. డొల్ల కంపెనీల పేరుతో నిధులు దారి మళ్లించారు. 21-07-2017లోనే రూ.371 కోట్ల నిధులకు పన్నుల ఎగవేతపై జీఎస్టీ ఏపీ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. 05-01-2018న ఏపీ ప్రభుత్వాన్ని హెచ్చరించడంతోపాటు సీబీఐని విచారించాలని జీఎస్టీ కోరింది. ఈ కేసు కేంద్ర దర్యాప్తు సంస్ధల విచారణలో ఉండగానే 26-07-2018న 17ఏ సవరణ జరిగింది. ఈ కేసులో చంద్రబాబుకి 17ఏ వర్తించదు.
-
2023-10-04T14:50:00+05:30
ఏసీబీ కోర్టులో ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు
‘‘ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చంద్రబాబు కోసం, చంద్రబాబు చుట్టూనే తిరిగింది. ఈ సంస్థ కేవలం చంద్రబాబు కోసమే సృష్టించబడింది. ఒకటి నుంచి ఇప్పటి చంద్రబాబు వరకు ముద్దాయిలందరికీ ఏదో ఒక స్థాయిలో ఈ కార్పొరేషన్ ద్వారా వ్యక్తిగత లబ్ది చేకూరింది. 2018లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ హెచ్చరికల నేపథ్యంలో కంటితుడుపు విచారణకు ఆదేశించింది. ఆ విచారణ తరువాత బుట్ట దాఖలైంది’’.
-
2023-10-04T14:45:00+05:30
చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో వాదనలు పున:ప్రారంభమయ్యాయి.
ప్రభుత్వం తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు.
-
2023-10-04T13:32:00+05:30
చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై విచారణ వాయిదా
మధ్యాహ్నం 2.30 తర్వాత ప్రభుత్వం తరపున వాదనలు వినిపించనున్న పొన్నవోలు సుధాకర్ రెడ్డి
చంద్రబాబు తరపున వాదనలు వినిపించిన ప్రమోద్ దూబే
-
2023-10-04T12:32:00+05:30
ఐఆర్ఆర్ కేసులో మాజీ మంత్రి నారాయణ పిటిషన్‌పై జడ్జి కీలక నిర్ణయం
ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్ మార్పు కేసులో (IRR Case) మాజీ మంత్రి నారాయణకు 41ఏ నోటీసులపై ఏపీ హైకోర్ట్ విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. విచారణను వేరే బెంచ్‌కు వేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. నేడు (బుధవారం) హైకోర్టులో జస్టిస్ శ్రీనివాస రెడ్డి ముందు విచారణకు రావాల్సి ఉన్నప్పటికీ.. తాను ఈ పిటిషన్‌పై విచారణ చేయబోనని, మరో బెంచ్ ముందుకు వెళ్ళాలని న్యాయమూర్తి అన్నారు. రెండు రోజులు పాటు విచారణకు రావాలని ఒత్తిడి చేయవద్దని సీఐడీని కోర్ట్ ఆదేశించింది. దీంతో వేరే బెంచ్‌కు మార్చాలని రిజిస్ట్రీకు ఆదేశాలు జారీ అయ్యాయి.
-
2023-10-04T12:15:00+05:30
చంద్రబాబు పిటిషన్లపై ఏసీబీ కోర్టులో విచారణ కొనసాగుతోంది. చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై ప్రమోద్ కుమార్ దూబే వాదనలు వివిపిస్తున్నారు.
దూబే వాదనలు ఇవే..
స్కిల్ కేసులో చంద్రబాబు వైపు ఎలాంటి తప్పిదాలు లేవు. అప్పటి ఆర్థిక శాఖ ఉన్నతాధికారి కే.సునీత గుజరాత్ వెళ్లి అధ్యయనం చేశారు. సునీత అధ్యయనం చేసి ఎలాంటి అభ్యంతరం సీమెన్స్ ప్రాజెక్టుకు తెలపలేదు. సీమెన్స్ ప్రాజెక్టుకు ఎలాంటి అభ్యంతరం లేకుండా కేబినెట్ ఆమోదం పొందిందన్న విషయమై ఆధారాలు ఉన్నాయి. కాస్ట్ ఎవాల్యూయేషన్ కమిటీ స్కిల్ ప్రాజెక్టు ఎక్విప్‌మెంట్ ధరను నిర్ధారించింది. ఆ కమిటీలో చంద్రబాబు లేరు. ఆ కమిటీలో ఉన్న భాస్కరరావు ప్రస్తుతం మధ్యంతర బెయిల్ మీద ఉన్నారు. సుప్రీంకోర్టు నవంబర్ 16 వరకు మధ్యంతర బెయిలును పొడిగించింది. చంద్రబాబుకు ఎలాంటి నోటీసివ్వకుండా అరెస్ట్ చేశారు.
అరెస్ట్ చేసిన తర్వాత విచారణ చేపట్టారు. ఆ తర్వాత రెండు రోజుల కస్టడీలోనూ విచారణ చేపట్టారు. ఇప్పుడు మళ్లీ కస్టడీ కావాలంటున్నారు.. అవసరం ఏముందు..?. కేబినెట్ ఆమోదం పొందిన తర్వాతే సీమెన్స్ ప్రాజెక్టు అమల్లోకి వచ్చింది. కెబినెట్ నిర్ణయంపై చంద్రబాబు మీద కేసు ఎలా పెడతారు.
-
2023-10-04T12:07:00+05:30
పొన్నవోలు సుధాకర్ రెడ్డి రాకుండానే విచారణ ప్రారంభం
చంద్రబాబు తరపున వాదనలు వినిపిస్తున్న న్యాయవాది ప్రమోద్ కుమార్
చంద్రబాబు తరపు లాయర్ల వాదనలు నోట్ చేసుకుంటున్న సీఐడీ న్యాయవాదులు
-
2023-10-04T11:50:00+05:30
చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో వాదనలు వినిపించడానికి సిద్దమైన సుప్రీంకోర్టు న్యాయవాది ప్రమోద్ దూబే
ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వచ్చే వరకు సమయం ఇవ్వాలన్న స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వివేకానంద
12.30 వరకు సమయం అడగడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన న్యాయమూర్తి
అంత సమయం ఆగలేమని, సమయం అడగడం సమంజసం కాదన్న దూబే
పావు గంట బ్రేక్ ఇచ్చిన న్యాయమూర్తి