High Court: వివేకా హత్య కేసులో అజయ్ కల్లామ్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ.. విచారణకు వచ్చిన అంశాలు
ABN , First Publish Date - 2023-09-01T18:57:05+05:30 IST
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో (YS Vivekananda Reddy murder case) మాజీ ఐఏఎస్ అజయ్ కల్లామ్ (Ajay Kallam) వేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.
హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో (YS Vivekananda Reddy murder case) మాజీ ఐఏఎస్ అజయ్ కల్లామ్ (Ajay Kallam) వేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. తన పేరుతో సీబీఐ వేసిన స్టేట్‌మెంట్‌ను తొలగించాలని అజయ్ కల్లామ్ పిటిషన్‌లో పేర్కొన్నారు. తాను చెప్పని విషయాలు కూడా స్టేట్‌మెంట్‌లో సీబీఐ పెట్టిందని పిటిషన్‌లో అజయ్ కల్లామ్ తెలిపారు. వివేకా కేసులో అజయ్ కల్లామ్ సాక్షిగా ఉన్నారు. ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐకి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 15కి వాయిదా వేసినట్లు హైకోర్టు తెలిపింది.