RaghuramaKrishna Raju: ఎంపీ రఘురామ కస్టోడియల్ టార్చర్‌పై హైకోర్టు కీలక ఉత్తర్వులు

ABN , First Publish Date - 2023-06-13T16:00:33+05:30 IST

వైసీపీ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్‌పై ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. 2021 మే 15, 16 తేదీల్లో రఘురామకృష్ణ రాజు కస్టోడియల్ టార్చర్‌పై గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నివేదికలను కోర్టుకు సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది.

RaghuramaKrishna Raju: ఎంపీ రఘురామ కస్టోడియల్ టార్చర్‌పై హైకోర్టు కీలక ఉత్తర్వులు

అమరావతి: వైసీపీ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు (YCP Narsapuram MP Raghuramakrishna Raju) కస్టోడియల్ టార్చర్‌పై ఏపీ హైకోర్టు (AP High Court) కీలక ఉత్తర్వులు జారీ చేసింది. 2021 మే 15, 16 తేదీల్లో రఘురామకృష్ణ రాజు కస్టోడియల్ టార్చర్‌పై గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని (Guntur Government Hospital) నివేదికలను కోర్టుకు సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ నివేదికలను భద్రపరిచి సీల్డ్ కవర్‌లో కోర్టుకు ఇవ్వాలని స్పష్టం చేసింది.

ఈ నివేదికల కోసం ఎంపీ రఘురామ వెకేషన్ కోర్టు ముందు పిటిషన్ దాఖలు చేయగా.. ఎంపీ పిటీషన్‌పై న్యాయవాది వీ.వీ లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు. అయితే వేసవి సెలవుల అనంతరం విచారణ చేపడతామని హైకోర్టు వాయిదా వేసింది. దీంతో ఈరోజు (మంగళవారం) రఘురామ పిటిషన్‌కు సంబంధించి హైకోర్టులో విచారణ జరిగింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు మెడికల్ బోర్డు రిపోర్ట్ ఉందని ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ కౌంటర్ దాఖలు చేశారు. అయితే ఈ కౌంటర్‌పై హైకోర్టు, పిటీషనర్ తరపు న్యాయవాది తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సీఐడీ కోర్టు న్యాయమూర్తి ఆదేశాల మేరకు రఘురామకృష్ణ రాజు కస్టోడియల్ టార్చర్‌పై గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. కార్డియాలజీ, జనరల్ మెడిసిన్, రేడీయాలజీ నివేదికలు ఉన్నాయా లేవా అని ధర్మాసనం ప్రశ్నించింది. నివేదికలు ఉన్నాయని ప్రభుత్వ తరపు న్యాయవాది చెప్పారు. వాటిని వచ్చే వారంలో కోర్టుకు సీల్డ్ కవర్‌లో అందించాలని ఆదేశించింది. కాగా.. ఈలోగా నివేదికలు ధ్వంసం చేస్తే ఎలా అంటూ న్యాయవాది లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. దీంతో నివేదికలు భధ్ర పరచాలని, ఎట్టిపరిస్థితుల్లో కోర్టుకు సమర్పించాలని హైకోర్టు ధర్మాసనం మరోసారి స్పష్టం చేస్తూ తదుపరి విచారణను వచ్చే వారినికి వాయిదా వేసింది.

Updated Date - 2023-06-13T16:00:33+05:30 IST