Avinash Vs CBI : హైటెన్షన్ మధ్య అవినాష్ తల్లి ఆరోగ్యంపై విశ్వభారతి హాస్పిటల్ ప్రెస్ రిలీజ్.. ప్రస్తుతానికి..!
ABN , First Publish Date - 2023-05-22T10:32:16+05:30 IST
కర్నూలు విశ్వభారతి ఆస్పత్రి (Viswa Bharathi Hospital) పరిసర ప్రాంతాల్లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఓ వైపు భారీగా పోలీసులు మోహరించగా.. మరోవైపు వైసీపీ వీరాభిమానులు, కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. ఏ క్షణమైనా సరే..
కర్నూలు విశ్వభారతి ఆస్పత్రి (Viswa Bharathi Hospital) పరిసర ప్రాంతాల్లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఓ వైపు భారీగా పోలీసులు మోహరించగా.. మరోవైపు వైసీపీ వీరాభిమానులు, కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. ఏ క్షణమైనా సరే కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి సీబీఐ బృందాలు ప్లాన్ చేస్తున్నాయి. ఈ పరిస్థితుల మధ్యే అవినాష్ తల్లి శ్రీలక్ష్మి ఆరోగ్యంపై ఆస్పత్రి వర్గాలు ప్రెస్‌నోట్ రిలీజ్ చేశాయి. ‘ కడప ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి లక్ష్మిగారి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఆమెకు నాన్‌ఎస్‌టీ ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ (గుండె పోటు)కు గురయ్యారు. యాంజియోగ్రామ్ డబుల్ నాళాల వ్యాధితో శ్రీలక్ష్మి బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి బాలేదు. క్రిటికల్ కేర్ యూనిట్‌లో చికిత్స ఇస్తున్నాం. మరికొన్ని రోజులు ఐసీయూలోనే ఉంచాల్సిన పరిస్థితి ఉంది. ఆమెకు బీపీ ఇంకా తక్కువగానే ఉంది. నిన్న, ఈ రోజు వాంతులు అవుతూనే ఉన్నాయి. ఆమె మా వైద్యుల బృందం పర్యవేక్షణలో ఐసీయూలోనే ఉన్నారు. శ్రీలక్ష్మికి రక్తపోటు ఇప్పటికీ తక్కువగా ఉంది.. ఆమె అయానోట్రోపిక్ సపోర్ట్‌లో చికిత్స తీసుకుంటున్నారు. ఇంకా వాంతులు ఆగట్లేదు. వాంతులు ఇలాగే కొనసాగితే, మేము అల్ట్రాసౌండ్ ఉదరం, మెదడు యొక్క ఇమేజింగ్ ప్లాన్ చేస్తున్నాం. ఆమెకు బీపీ తక్కువగా ఉన్నందున మరికొన్ని రోజులు ఐసీయూలో ఉండాల్సి ఉంది’ అని మీడియాకు ఆస్పత్రి వర్గాలు రిలీజ్ చేసిన ప్రెస్‌నోట్‌లో ఉంది.
ఎప్పుడేం జరుగునో..!?
మరోవైపు.. మాజీ మంత్రి వివేకా హత్యకేసులో సహనిందితుడిగా ఉన్న ఎంపీ అవినాష్ రెడ్డిని ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశముంది. దీంతో విశ్వభారతి ఆస్పత్రి దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆస్పత్రి గేటు దగ్గర వైసీపీ శ్రేణులు బైఠాయించాయి. మరోవైపు.. ఆస్పత్రి ఆవరణలో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. పులివెందుల నుంచి కర్నూలుకు పెద్ద ఎత్తున అవినాష్ అనుచరులు, వైసీపీ శ్రేణులు చేరుకున్నారు. కర్నూలులో పరిస్థితిపై సీబీఐ ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ఢిల్లీ నుంచి స్థానిక పోలీసు అధికారులతో సీబీఐ బృందం మాట్లాడుతోంది. కర్నూలులో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు ఢిల్లీ సీబీఐ ఆఫీస్‌కు కర్నూలుకు వెళ్లిన అధికారులు సమాచారం అందిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకుండా జిల్లా ఎస్పీతో సీబీఐ అధికారులు చర్చిస్తున్నారు. ఆస్పత్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న వైసీపీ శ్రేణులను పోలీసులు వెనక్కి పంపుతున్నారు. అయితే ఈసారి అవినాష్‌ను సీబీఐ అరెస్ట్ చేస్తుందా లేకుంటే నోటీసులు ఇస్తుందా అనేదానిపై మరికాసేపట్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.