Pitani Satyanarayana: ఎవరైనా బీసీలను తక్కువగా చూస్తే వారి రాజకీయ మనుగడను భూస్థాపితం చేస్తాం

ABN , First Publish Date - 2023-04-11T20:00:04+05:30 IST

ఎవరైనా బీసీలను తక్కువగా చూస్తే వారి రాజకీయ మనుగడను భూస్థాపితం చేస్తామని పితాని హెచ్చరించారు.

 Pitani Satyanarayana: ఎవరైనా బీసీలను తక్కువగా చూస్తే వారి రాజకీయ మనుగడను భూస్థాపితం చేస్తాం

ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెం: బీసీలు జనాభాలో సగానికంటే ఎక్కువ ఉన్నారని, కానీ కుల గణన మాత్రం చేపట్టలేదని, 2021 జనాభా లెక్కలను కుల గణన ప్రకారం నిర్వహించాలని మాజీ మంత్రి పితాని సత్యనారాయణ (Former Minister Pitani Satyanarayana) డిమాండ్ చేశారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో గతంలో ఉన్న 34 శాతాన్ని ఈ ప్రభుత్వం 24 శాతానికి తగ్గించిందని, దాన్ని జనాభా దామాషా ప్రకారం పెంచాలన్నారు. బీసీలకు చట్టసభలలో ప్రత్యేకంగా రిజర్వేషన్లు చేయాలని, ఎవరైనా బీసీలను తక్కువగా చూస్తే వారి రాజకీయ మనుగడను భూస్థాపితం చేస్తామని పితాని హెచ్చరించారు.

బీసీలకు ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా తాను ముందుంటానని, బీసీలంతా సంఘటితమై ముందుకు సాగాల్సిన అవసరం ఉందని గౌతు శిరీష అన్నారు. బీసీలు రాజ్యాధికారం వైపు అడుగులు వేయాలని, ప్రత్యేక కుల కార్పొరేషన్‌లో లేకుండా అందరం కలిసి ఉండేలాగా చూడాలని అన్నారు.

కులగణనతో పాటు రిజర్వేషన్లు సాధించుకోవాల్సినటువంటి ఆవశ్యకత బీసీలకు ఉందని, ప్రస్తుత ప్రభుత్వంలో కులానికో కార్పొరేషన్ పెట్టారని, రూపాయి నిధులు విదల్చలేదని బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు పాకా సత్యనారాయణ అన్నారు.

మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆలపాటి గంగాభవాని కళ్యాణ మండపంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు జరిగాయి. బీసీల ఆత్మీయ సదస్సును బీసీ సాధికార సమితి ఆధ్వర్యంలో అఖిలభారత గౌడసంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ దాసరి శ్యామ్ చంద్ర శేషు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అఖిల భారత గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ దాసరి శ్యామ్ చంద్ర శేషు సభాధ్యక్షత వహించగా, ముఖ్య అతిథులుగా మాజీ మంత్రివర్యులు పితాని సత్యనారాయణ, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష, ఏపీ బీజీపీ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం చైర్మన్ పాకా సత్యనారాయణ, వివిధ రాష్ట్ర సంఘాల అధ్యక్షులు, బీసీ ప్రముఖులు హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సీలం వెంకటేశ్వరరావు, శెట్టిబలిజ సాధికార రాష్ట్ర కన్వీనర్ కుడిపూడి సత్తిబాబు, శ్రీశయనసాధికార రాష్ట్ర కన్వీనర్ పట్నాల వెంకటేష్ బాబు, బీసీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కరణం పెద్దిరాజు, అతిరాస రాష్ట్ర కన్వీనర్ శుక్ల బోయిన సత్యనారాయణ, రాష్ట్ర ఎంబీసీ సాధికార కన్వీనర్ పెండ్ర రమేష్, బీసీ సెల్ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి కొండపల్లి రవి, బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి చిట్టిబోయిన రామలింగేశ్వరరావు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు, మండల అధ్యక్షులు సాయిల సత్యనారాయణ, నాయుడు రామకృష్ణ, సిరి బత్తిన కొండబాబు, చింతల వెంకటరమణ, రాజానా పండు, చిట్రోజు తాతాజీ, సూర్య చంద్ర శ్రీనివాస్, గంధం అప్పాజీ, చలమయ్య, చెన్ను శ్రీనివాస్ యాదవ్, తెరగారపు జ్యోతి, నల్లూరు గోపి, బూసా సత్యనారాయణ, పాకనాటిఅంజి, ఈర్నిసూరిబాబు, ఆర్గనైజర్స్ కొంచాడ ప్రసాద్, కోనేటి చంటి, గడా సుబ్రహ్మణ్యం, పితాని నాగు, పండు యాదవ్, మన్యం దుర్గారావు, సాయి ఉదరసుబ్బారావుతోపాటు భారీ ఎత్తున బీసీలు పాల్గొన్నారు

Updated Date - 2023-04-11T20:00:31+05:30 IST