ACB COURT : చంద్రబాబు అరెస్ట్ సమయంలో సీఐడీ కాల్ రికార్డుపై విచారణ.. ఇరువురు లాయర్ల వాగ్వాదం

ABN , First Publish Date - 2023-10-12T17:34:23+05:30 IST

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు (Chandrababu) అరెస్ట్ సమయంలో సీఐడీ అధికారుల కాల్ రికార్డుపై ఏసీబీ కోర్టులో (ACB COURT) విచారణ జరుగుతోంది.

ACB COURT : చంద్రబాబు అరెస్ట్ సమయంలో సీఐడీ కాల్ రికార్డుపై విచారణ.. ఇరువురు లాయర్ల వాగ్వాదం

విజయవాడ : టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు (Chandra babu) అరెస్ట్ సమయంలో సీఐడీ అధికారుల కాల్ రికార్డుపై ఏసీబీ కోర్టులో (ACB COURT) విచారణ జరుగుతోంది. సీఐడీ తరపు న్యాయవాదులకు, చంద్రబాబు తరపు న్యాయవాదులకు మద్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. న్యాయవాదుల తీరుపై న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. ఇలాగైతే విచారణ నిలిపి వేస్తామని న్యాయమూర్తి స్పష్టం చేశారు. కోర్టు హాలులో అరుచుకున్న న్యాయవాదుల వివరాలు రికార్డు చేయాలని జడ్జి ఆదేశించారు. వివాదాలతో ఉంటే ఈ కేసు విచారణ తాను చేయలేనని న్యాయమూర్తి బెంచ్ దిగి వెళ్లిపోయారు. కేసు విచారణ వాయిదా పడింది.

CBN-Arrest.jpg

Updated Date - 2023-10-12T18:12:55+05:30 IST