వేగం పెంచిన సీబీఐ.. జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డిపై ప్రశ్నల వర్షం

ABN , First Publish Date - 2023-02-03T18:16:56+05:30 IST

వైఎస్ వివేకానందరెడ్డి (YS Vivekananda Reddy) హత్య కేసులో సీబీఐ దర్యాప్తు వేగాన్ని పెంచింది. సీఎం జగన్ (CM Jagan), ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డిని సీబీఐ (CBI) ప్రశ్నిస్తోంది.

వేగం పెంచిన సీబీఐ.. జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డిపై ప్రశ్నల వర్షం

కడప: వైఎస్ వివేకానందరెడ్డి (YS Vivekananda Reddy) హత్య కేసులో సీబీఐ దర్యాప్తు వేగాన్ని పెంచింది. సీఎం జగన్ (CM Jagan), ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డిని సీబీఐ (CBI) ప్రశ్నిస్తోంది. కడప సెంట్రల్ జైలు కేంద్రంగా దర్యాప్తు కొనసాగుతోంది. ఎంపీ అవినాష్‌రెడ్డి కాల్ డేటా ఆధారంగా కృష్ణమోహన్‌రెడ్డిని సీబీఐ బృందం ప్రశ్నిస్తోంది. కాసేపట్లో వైఎస్ భారతి (YS Bharathi) పీఏ నవీన్ విచారణకు హాజరుకానున్నారు. కాల్ డేటాపై పూర్తిస్థాయిలో సీబీఐ దర్యాప్తు చేస్తోంది. భారతికి వచ్చిన కాల్‌ ఆధారంగా నవీన్‌ను ప్రశ్నించనున్నట్లు సమాచారం. ఈ కేసులో ముందు నుంచీ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాశ్‌ రెడ్డి (MP Avinash Reddy)ని సీబీఐ అధికారులు మొట్టమొదటిసారిగా ప్రశ్నించిన విషయం తెలిసిందే.

సీబీఐ ఎస్పీ రాంసింగ్‌ నేతృత్వంలోని బృందం ముందుగా సిద్ధం చేసుకున్న ప్రశ్నావళితో సుమారు నాలుగున్నర గంటలపాటు అవినాశ్‌ రెడ్డిని ప్రశ్నించింది. అధికారులు పదుల సంఖ్యలో అడిగిన ప్రశ్నల్లో చాలా వరకు ఆయన సమాధానాలు చెప్పలేదని తెలిసింది. వివేకానంద రెడ్డి హత్య జరిగిన రోజు ఘటనా స్థలంలో ఆధారాల ట్యాంపరింగ్‌, సాక్ష్యాల విధ్వంసంపైనే సీబీఐ ప్రధానంగా ప్రశ్నించినట్లు సమాచారం. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న డ్రైవర్‌ దస్తగిరి అప్రూవర్‌గా మారి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా మరిన్ని ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది. కేసు నమోదు తర్వాత సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌లో లభించిన ఆధారాలు, అంతకుముందే ‘సిట్‌’ పోలీసులు జరిపిన దర్యాప్తు ప్రాతిపదికన ప్రత్యేక ప్రశ్నావళి రూపొందించుకున్నారు.

Updated Date - 2023-02-03T18:16:57+05:30 IST