YS Jagan : రోజా, మున్సిపల్ చైర్ పర్సన్ మధ్య సయోధ్యకు యత్నించి విఫలమైన జగన్
ABN , First Publish Date - 2023-08-28T14:12:12+05:30 IST
ఏపీ సీఎం జగన్ నేడు నగరిలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి రోజా, మున్సిపల్ చైర్ పర్సన్ కేజే శాంతి మధ్య సయోధ్య కుదిర్చేందుకు సీఎం యత్నించి విఫలమయ్యారు. అసలే నగరిలో పరిస్థితులన్నీ రోజాకు వ్యతిరేకంగా ఉన్నాయి.
చిత్తూరు: ఏపీ సీఎం జగన్ నేడు నగరిలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి రోజా, మున్సిపల్ చైర్ పర్సన్ కేజే శాంతి మధ్య సయోధ్య కుదిర్చేందుకు సీఎం యత్నించి విఫలమయ్యారు. అసలే నగరిలో పరిస్థితులన్నీ రోజాకు వ్యతిరేకంగా ఉన్నాయి. సొంత పార్టీ నేతలే ఆమెను ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలో సీఎం జగన్ కల్పించుకుని ఏదో సయోధ్య చేద్దామనుకుంటే.. దానిని కూడా రోజా కాలదన్నేసుకున్నారు. నగిరిలో సభా వేదికపై సీఎం జగన్మోహన్ రెడ్డి మంత్రి రోజా మున్సిపల్ చైర్ పర్సన్ కేజే శాంతి ఇద్దరి చేతులు కలిపి.. ఇక మీదట కలిసి మెలిసి ఉండాలని చెప్పారు. కానీ రోజా వింటేనా? దీంతో శాంతి సైతం తనకెందుకులే అనుకున్నట్టున్నారు. ఇద్దరూ చేతులు కలిపినట్టే కలిపి వెంటనే వెనక్కి తీసేసుకున్నారు. గత కొంత కాలం నుంచి రోజా మున్సిపల్ చైర్ పర్సన్ కేజే శాంతి వర్గాల మధ్య వర్గ పోరు బీభత్సంగా నడుస్తోంది. వీరిద్దరి మధ్య సయోధ్యకు నేడు సీఎం జగన్ యత్నించి విఫలమయ్యారు.