Home » RK Roja
Mandipalli Ramprasad Reddy: మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఆడుదాం ఆంధ్ర’ పేరుతో భారీ స్థాయిలో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. విచారణ చేస్తున్నామని.. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్‌బుక్ తెరిచారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఏపీలో రెడ్‌బుక్ పాలన కొనసాగుతోందని విమర్శిస్తున్నారు. రెడ్‌బుక్ పేరుతో ఇష్టారీతిగా కూటమి ప్రభుత్వం వ్యవహారిస్తోందని ఆరోపణలు చేస్తున్నారు.
RK Roja: అసమర్థ టీటీడీ చైర్మన్, ఎస్సీ, కలెక్టర్ వలనే ఈ పరిస్థితి వచ్చిందని.. వీరు ఎవరికీ భక్తి లేదని మాజీ మంత్రి ఆర్కే రోజా వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు భజనే వీరికి ముఖ్యమంటూ విరుచుకుపడ్డారు. పోలీసులను చంద్రబాబు సేవలో పెట్టారని.. వచ్చిన భక్తులకు కనీసం సౌకర్యాలు కూడా కల్పించలేదని ఆరోపించారు.
Varla Ramaiah:వైసీపీ అధినేత వైఎస్ జగన్ మంచి ఫ్యామిలీ మెన్, బిజినెస్ మెన్ అంటూ మాజీ మంత్రి ఆర్కే రోజా చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య తనదైన శైలిలో స్పందించారు.
వైసీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజాపై కర్నూలు మూడో పట్టణ పోలీస్ స్టేషన్‌లో దళిత సంఘాలు ఫిర్యాదు చేశాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని బాపట్లలో సూర్యలంక బీచ్‌లో దళితుడిని ఆర్కే రోజా అవమానించిందని ఆయా సంఘాలు ఆరోపించాయి.
అదానీతో కలిపి వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి స్కాం చేశారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. అయితే ఈ విషయంపై షర్మిలకు మాజీ మంత్రి రోజా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
అదృశ్యమైన 30 మంది మహిళలకు గుర్తించి.. వారిని స్వస్థలాలకు తీసుకు వచ్చే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చూట్టింది. విశాఖపట్నంలోని శారదా పీఠానికి జగన్ ప్రభుత్వం అప్పనంగా అప్పగించిన వందల కోట్ల విలువైన 15 ఎకరాల భూమి కేటాయింపును సైతం రద్దు చేసింది. ఈ తరహా అక్రమాలపై కూటమి ప్రభుత్వం తనదైన శైలిలో వ్యవహరిస్తూ.. ముందుకు వెళ్తుంది. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ అండ్ కో తట్టుకో లేకపోతుంది.
వైసీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజాకు జబర్దస్ పంచ్ పడింది. తన యూట్యూబ్ ఛానెల్లో తిరుపతి లడ్డూ వ్యవహారంపై ఆమె పోల్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆర్కే రోజాకు నెటిజన్లు గట్టి ఝలక్ ఇచ్చారు. తిరుపలి లడ్డూలో కల్తీ చేసింది ఎవంటూ రోజా తన యూట్యూబ్ చానెల్లో పొల్ చేపట్టారు.
రోజా సెల్వమణి.. ప్రస్తుత ఏపీ రాజకీయాల్లో చాలామందికి తెలిసిన పేరు. నగరి ఎమ్మెల్యేగా ఉంటూ రెండేళ్లకు పైగా టూరిజం శాఖ మంత్రిగా పనిచేశారు. వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లూ విపక్షాలను తిట్టే బాధ్యతను తీసుకున్నారు. అధికారంలో శాశ్వతంగా ఉండేది తామేనన్న రేంజ్లో స్థాయి మరిచి.. విమర్శలు చేశారు.
వైఎస్సార్సీపీ ఫైర్ బ్రాండ్, ఏపీ అసెంబ్లీ ఎన్నికలు-2024లలో నగరి నియోజకవర్గం నుంచి భారీ ఓట్ల తేడాతో ఓడిపోయిన మాజీ మంత్రి ఆర్కే రోజా శుక్రవారం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఓటమి అనంతరం తొలిసారి ఆమె స్పందించారు.