Share News

AP News: రాత్రికి రాత్రి వెలసిన జగన్ పోస్టర్లు.. క్స్రైస్తవ సంఘాల అభ్యంతరం

ABN , Publish Date - Dec 21 , 2023 | 02:45 PM

Andhrapradesh: నగరంలోని పలు ప్రాంతాల్లో రాత్రికి రాత్రి సీఎం జగన్ పోస్టర్‌లు వెలిశాయి. జగన్మోహన రెడ్డి జన్మదినం కోసం వేసిన పోస్టర్‌లుగా కాకుండా ఓ వర్గం ఓటర్లను టార్గెట్ చేసేలా పోస్టర్ ఉన్నాయి. జగనన్న కనెక్టు పేరుతో తాడేపల్లి ప్యాలెస్ పెద్దల ఆదేశంలోనే పోస్టర్ ఏర్పాటు అయ్యాయి.

AP News: రాత్రికి రాత్రి వెలసిన జగన్ పోస్టర్లు.. క్స్రైస్తవ సంఘాల అభ్యంతరం

విజయవాడ: నగరంలోని పలు ప్రాంతాల్లో రాత్రికి రాత్రి సీఎం జగన్ పోస్టర్‌లు వెలిశాయి. జగన్మోహన రెడ్డి జన్మదినం కోసం వేసిన పోస్టర్‌లుగా కాకుండా ఓ వర్గం ఓటర్లను టార్గెట్ చేసేలా పోస్టర్ ఉన్నాయి. జగనన్న కనెక్టు పేరుతో తాడేపల్లి ప్యాలెస్ పెద్దల ఆదేశంలోనే పోస్టర్ ఏర్పాటు అయ్యాయి. డీటెయిల్స్‌లోకి వెళ్లకపోతే పోస్టర్ చూసిన వారికి అయిదు రొట్టెలు, రెండు చేపలు పంచిన జీసస్ అని తలపించేలా పోస్టర్ ఉననాయి. ఈ విధంగా పోస్టర్ వేయడంపై క్రైస్తవ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పోస్టర్‌లో ఓ మూలన చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్‌‌తో పాటు నక్క చిత్రాన్ని చిత్రించడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. వ్యక్తిత్వ హననం జరిగేలా పోస్టర్ వేసినా విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ ఎలా అంగీకరించింది అని విపక్షాలు మండిపడుతున్నాయి. బస్టాండ్, రైల్వే స్టేషన్, కనకదుర్గ అమ్మవారి గుడికి వెళ్లే మార్గంలో పోస్టర్‌లు వెలిశాయి. పోస్టర్‌లో దింసా నృత్యం, హరిదాసు, గంగిరెద్దులాడించే వాడు, పల్లెకారులు, కల్లుగీత కార్మికులులతో పోస్టర్‌ను రూపొందించారు. పోస్టర్‌లో విభిన్న వస్త్రదారణతో సీఎం జగన్ చిత్రం వేశారు. జగన్‌ను చూస్తూ చేతులెత్తి మోక్కుతున్న చిన్నారిని ఎత్తుకున్న తండ్రి వంటి డీటెయిల్స్‌తో చిత్రం రూపొందించారు. వీటితోపాటు పోలవరం ప్రాజెక్టు పూర్తి అయినట్టు పచ్చి అబద్దాలతో ఆ పక్కనే భారీ వైఎస్‌ఆర్ విగ్రహాన్ని కూడా పోస్టర్‌లో కనబడే విధంగా చిత్రికరించారు. ఈ పోస్టర్‌పై విపక్షాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.

.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Dec 21 , 2023 | 02:45 PM