Share News

CM Jagan: పుట్టపర్తి శ్రీసత్యసాయి ఎయిర్‌పోర్టుకు చేరుకున్న జగన్

ABN , First Publish Date - 2023-11-07T10:52:14+05:30 IST

ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో పుట్టపర్తి శ్రీ సత్యసాయి విమానాశ్రయానికి చేరుకున్నారు.

CM Jagan: పుట్టపర్తి శ్రీసత్యసాయి ఎయిర్‌పోర్టుకు చేరుకున్న జగన్

శ్రీ సత్యసాయి: ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి (CM Jaganmohan Reddy) గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో పుట్టపర్తి శ్రీ సత్యసాయి విమానాశ్రయానికి (Puttaparthi Sri Satyasai Airport) చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్టులో సీఎంకు జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులు, సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టి ఆర్జే రత్నాకర్ పుష్పగుచ్చాలు అందజేసి ఘనస్వాగతం పలికారు. కట్టుదిట్టమైన భద్రత, భారీ కాన్వాయ్ నడుమ జగన్ సభా ప్రాంగణానికి పయనమయ్యారు. మరికొద్ది సేపట్లో ముఖ్యమంత్రి జగన్ సభా ప్రాంగణానికి చేరుకోనున్నారు.


మరోవైపు జిల్లాలో సీఎం జగన్ పర్యటన నిరసిస్తూ చలో పుట్టపర్తికి టీడీపీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఎక్కడికక్కడ టీడీపీ నేతలను గృహ నిర్బంధం చేశారు. మాజీ మంత్రులు కాల్వ శ్రీనివాసులు, పల్లె రఘునాథరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారధి, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి పోలీసుల అదుపులో ఉన్నారు. మడకశిర నుంచి పోలీసు వాహనాల్లో తరలించి ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో నేతలను పోలీసులు నిర్బంధించారు. పోలీసుల తీరుపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నారు. అటు పెనుకొండలో టీడీపీ ఆధ్వర్యంలో నిరసనలు మిన్నంటాయి. సీఎం గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఎన్టీఆర్ కూడలిలో నల్ల బెలూన్లతో సీఎం గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తున్న తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవితమ్మను పోలీసులు అరెస్ట్ చేశారు.

Updated Date - 2023-11-07T12:23:46+05:30 IST