Chandrababu : భువనేశ్వరి ములాఖత్ దరఖాస్తును తిరస్కరించిన జైలు అధికారులు

ABN , First Publish Date - 2023-09-15T11:09:13+05:30 IST

జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును నేడు కలిసేందుకు అయన సతీమణి భువనేశ్వరిని ములాఖత్ దరఖాస్తును జైలు అధికారులు తిరస్కరించారు.

Chandrababu : భువనేశ్వరి ములాఖత్ దరఖాస్తును తిరస్కరించిన జైలు అధికారులు

రాజమహేంద్రవరం : స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్‌లో స్కామ్ జరిగిందంటూ అక్రమ కేసు బనాయించడంతో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రిమాండ్‌పై రాజమండి సెంట్రల్ జైల్లో ఉన్నారు. వివక్షపూరితంగా వయసు, హోదా కూడా పరిగణలోకి తీసుకోకుండా జైల్లో తీవ్ర అసౌకర్యాలకు గురిచేస్తున్నారంటూ ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. భద్రతపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్న తరుణంలో మరో కీలక పరిణామం జరిగింది.


టీడీపీ అధినేత చంద్రబాబును శుక్రవారం (నేడు) కలిసేందుకు అయన సతీమణి నారా భువనేశ్వరిని ములాఖత్ దరఖాస్తు చేసుకోగా జైలు అధికారులు తిరస్కరించారు. వారానికి మూడు సార్లు ములాఖత్‌కు అవకాశం ఉన్నా భువనేశ్వరి ధరఖాస్తును రాజమండ్రి జైలు అధికారులు తిరస్కరించడం చర్చనీయాంశమైంది. చంద్రబాబు అరెస్టు తరువాత నారా భువనేశ్వరి రాజమండ్రిలోనే ఉంటున్నారు. అక్రమ కేసు పెట్టడమే కాకుండా కనీసం ములాఖత్ విషయంలో కూడా ప్రభుత్వం అమానవీయంగా వ్యవహరించడంపై భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనల ప్రకారం ములాఖత్ ఇచ్చేందుకు అవకాశం ఉన్నా కాదనడంపై భువనేశ్వరి విచారం వ్యక్తం చేశారు.


ఇదిలావుండగా చంద్రబాబు ఉన్న రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలు సూపరింటెండెంట్‌ ఎస్‌.రాహుల్‌ నాలుగు రోజులు సెలవుపై ఉన్నారు. శుక్రవారం నుంచి 18వ తేదీ వరకూ ఆయన సెలవులో ఉంటారు. ఆయన భార్యకు అనారోగ్యం కారణంగా దగ్గర ఉండి చూసుకోవాల్సి రావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో సెలవు పెట్టారని ఉన్నతాధికారులు వివరించారు. అయితే ఆయన స్థానంలో ఆ నాలుగు రోజులూ జైళ్ల శాఖ కోస్తాంధ్ర ప్రాంత డీఐజీ రవికిరణ్‌ జైలు పర్యవేక్షణ బాధ్యతలు చూసుకుంటారు. ప్రస్తుతం ములాఖత్ బెయిల్ పిటిషన్ తిరస్కరించిన ఈ రవికిరణ్... ఆర్థిక మంత్రి బుగ్గన అక్క కొడుకు అని ప్రచారం జరుగుతోంది. నిజానిజాలు తెలియాల్సి ఉంది.

Updated Date - 2023-09-15T11:55:15+05:30 IST