Pawan Vs Jagan: మన ఏపీ సీఎంతో ఎవరైనా ‘పాపం పసివాడు’ సినిమా తీస్తారా?.. జగన్‌పై పవన్ వ్యంగ్యాస్త్రాలు

ABN , First Publish Date - 2023-05-17T09:25:01+05:30 IST

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘

Pawan Vs Jagan: మన ఏపీ సీఎంతో ఎవరైనా ‘పాపం పసివాడు’ సినిమా తీస్తారా?.. జగన్‌పై పవన్ వ్యంగ్యాస్త్రాలు

అమరావతి: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై (AP CM YS Jaganmohan Reddy) జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Janasean Chief Pawan Kalyan) వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘పాపం పసివాడు’’ సినిమా పేరును ప్రస్తావిస్తూ జగన్ (AP CM) తీరుపై మండిపడ్డారు. నిన్న బాపట్ల మత్స్యకార సభలో పవన్ కళ్యాణ్‌‌ను (Janasena) లక్ష్యంగా చేసుకుని సీఎం విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీఎం వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ జనసేనాని ట్వీట్ చేశారు. తనకు ఏమీ తెలియదు అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి చెప్పే వాటికే... ‘‘పాపం పసివాడు’’ సినిమా తీయాలంటూ పవన్ కళ్యాణ్ చురకలంటించారు.

ఇంతకీ పవన్ ఏమన్నారంటే...‘‘మన ఏపీ సీఎంతో ఎవరైనా ‘‘పాపం పసివాడు’’ సినిమా తీస్తారని ఆశిస్తున్నాను. అతను చాలా అమాయకుడు. ఇక్కడ ఒక చిన్న మార్పు మాత్రమే అవసరం. అతని చేతిలో 'సూట్‌కేస్'కి బదులుగా, అతని అక్రమ సంపద కోసం మనీలాండరింగ్‌ని సులభతరం చేసే బహుళ 'సూట్‌కేస్ కంపెనీలను' ఉంచండి. ప్రియమైన ఏపీ సీఎం... మీరు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య లేదా కామ్రేడ్ తరిమెల నాగి రెడ్డి కాదు. మీరు అక్రమంగా సంపాదించిన సంపదతో, ప్రజలపై విరుచుకుపడే హింసతో 'వర్గయుద్ధం' అనే పదాన్ని ఉచ్చరించే హక్కు కూడా మీకు లేదు. ఏదో ఒక రోజు 'రాయలసీమ' మీ నుంచి, మీ గుంపు బారి నుంచి విముక్తి పొందుతుందని ఆశిస్తున్నాను. పాపం పసివాడు సినిమా కథనానికి రాజస్థాన్ ఎడారి ఇసుక దిబ్బలు కావాలి, కానీ ఇసుకను ఏపీలో నది ఒడ్డున వైసీపీ దోచుకుంది. కలెక్షన్ పాయింట్లలో తగినంత ఇసుక దిబ్బలు ఉన్నాయి. చీర్స్!!’’ అంటూ పవన్ ట్వీట్ చేశారు.

జగన్ చేసిన వ్యాఖ్యలు ఇవే...

నిన్న బాపట్ల జిల్లా నిజాంపట్నంలో జరిగిన మత్సకార భరోసా సభలో చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌పై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు 175 నియోజకవర్గాలలో బరిలోకి దిగే సత్తా లేదన్నారు. కనీసం 175 స్థానాల్లో చంద్రబాబు పార్టీ రెండో స్థానం కూడా వస్తుందా అని నమ్మకం కూడా చంద్రబాబుకు లేదని తెలిపారు. రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులను పోటీకి పెట్టలేని వారు ఏం మాట్లాడతారని ప్రశ్నించారు. చంద్రబాబు పార్టీ వెంటిలేటర్‌పై ఉందని.. అందుకే దత్తపుత్రుడుని నమ్ముకున్నారన్నారు. ఇదే దత్తపుత్రుడిని జనం ఎమ్మెల్యేగా కూడా పనికిరారని ఓడించారని అన్నారు. ‘‘బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్నది వీల్లే. పెళ్లి చేసుకున్నది వీల్లే, విడాకులు ఇచ్చేది వాళ్లే.. మళ్లీ పెళ్లి చేసుకున్నది.. మళ్లీ విడాకులు ఇచ్చేది వీల్లే. చంద్రబాబు కలిసి వెల్దాం అన్నారు. దత్తపుత్రుడు చిత్తం ప్రభు అన్నారు. చంద్రబాబుకు ఏది మంచి జరిగితే అలాగే చేస్తానని దత్తపుత్రుడు చెబుతారు. పోటీ వద్దని చెబితే అలాగే చేస్తాడు.చంద్రబాబు గాజువాక రానంటారు, దత్తపుత్రుడు మంగళగిరిలో పోటీ పెట్టకుండా ఆగుతాడు. చంద్రబాబు చెబితే బీజేపీతో దత్తపుత్రుడు తెగదెంపులు చేసుకుంటారు. చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీల కోసం దత్తపుత్రుడు ఏం చేయటానికైనా వెనకాడరు’’ అంటూ జగన్ విరుచుకుపడ్డారు.

Updated Date - 2023-05-17T10:25:34+05:30 IST