Janasena: పిచ్చికుక్క జోగి రమేష్ అంటూ చెప్పులతో కొట్టిన జనసేన వీర మహిళలు
ABN , First Publish Date - 2023-07-25T11:41:59+05:30 IST
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా జనసేన నేతలు ఆందోళనకు దిగారు.
విజయవాడ: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై (Janasena Chief Pawan Kalyan) మంత్రి జోగి రమేష్ (Minister Jogi Ramesh) చేసిన వ్యాఖ్యలకు నిరసనగా జనసేన నేతలు ఆందోళనకు దిగారు. జనసేన రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు ఆధ్వర్యంలో పిచ్చి కుక్క జోగి రమేష్ అంటూ జనసేన వీర మహిళలు చెప్పులతో కొట్టారు. జోగి రమేష్ దిష్టి బొమ్మ దగ్ధానికి యత్నించగా... పోలీసులు అడ్డుకున్నారు. వెంటనే దిష్టి బొమ్మను పోలీసులు లాక్కెళ్లిపోయారు. అమ్మిశెట్టి వాసును పోలీసులు అరెస్టు చేశారు.
మంత్రి పదవి పక్కన పెట్టి రారా.. బట్టలూడదీసి కొడతాం..
ఈ సందర్భంగా అమ్మిశెట్టి వాసు మాట్లాడుతూ.. జోగి రమేష్‌ను పిచ్చి కుక్కను కొట్టినట్లు కొట్టాలన్నారు. ‘‘నువ్వు తార్పితేనే ఎమ్మెల్యే సీటు, మంత్రి పదవి నీకు వచ్చింది. జోగి రమేష్ ఒక బ్రోకర్ గాడు, జోకర్ గాడు. మంత్రి పదవి వచ్చింది బ్రోకర్ పనులు చేసినందుకే. తప్పు అని చెప్పాల్సిన సీఎం కూడా సమర్ధించడం సిగ్గు చేటు. మీ నాయకుడిలా బాబాయిని చంపి అధికారంలోకి మేము రాలేదురా. మా పవన్ కళ్యాణ్ కష్టార్జితాన్ని పేదలకు పంచుతున్నారు. మీ జగన్ ప్రజల సొమ్మును దోచుకుంటున్నాడు. ప్రభుత్వ సొమ్ములు పంచే సభల్లో మా బూతులు ఏంటి. దమ్ముంటే మంత్రి పదవి పక్కన పెట్టి రారా. విజయవాడ నడి రోడ్ల పై బట్టలూడదీసి నిన్ను కొడతాం. అధికార మధంతో అడ్డగోలుగా వాగుతావా. సీటు రాదనే భయంతోనే కారుకూతలు కూస్తున్నాడు. ఎనిమిది నెలల్లో నువ్వు ఇంటికి పోవడం ఖాయం’’ అంటూ వాసు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.