Jawahar: ఎస్సీ వర్గీకరణపై జగన్ రెడ్డి నోరుమెదపడం లేదు ఎందుకు? జవహర్ సూటి ప్రశ్న
ABN , First Publish Date - 2023-11-12T14:40:51+05:30 IST
ఎస్సీ వర్గీకరణపై సీఎం జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) ఎందుకు నోరు మెదపడంలేదని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత కేఎస్ జవహర్ సూటిగా ప్రశ్నించారు.
అమరావతి: ఎస్సీ వర్గీకరణపై సీఎం జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) ఎందుకు నోరు మెదపడంలేదని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత కేఎస్ జవహర్ సూటిగా ప్రశ్నించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. "ఎస్సీ వర్గీకరణకు జగన్ రెడ్డి పూర్తి వ్యతిరేకం. వర్గీకరణకు కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చినా ఎందుకు దానిపై జగన్ రెడ్డి స్పందించడం లేదు? దళితుల చిరకాల వాంఛ అయిన వర్గీకరణకు జగన్ అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఈ అంశంపై నాలుగున్నరేళ్లలో ఒక్కరోజు కూడా స్పందించలేదు. సామాజిక న్యాయం టీడీపీ(TDP)తోనే సాధ్యం అవుతుంది. మాదిగ, మాల, రెల్లి కార్పొరేషన్ కు ఒక్క రూపాయి కూడా జగన్ ప్రభుత్వం కేటాయించలేదు.వచ్చే ఎన్నికల్లో జగన్ కు బుద్ధి చెప్పేందుకు ఎస్సీలు సిద్ధమయ్యారు" అని అన్నారు.