Chandrababu: కృష్ణయ్య కుటుంబానికి చంద్రబాబు రూ. 2 లక్షల ఆర్థిక సాయం..

ABN , First Publish Date - 2023-06-16T15:08:27+05:30 IST

కడప జిల్లా: పులివెందుల నియోజకవర్గంలోని సింహాద్రిపురం మండలం, అంకాలమ్మగూడూరులో మూడురోజుల క్రితం హత్యకు గురైన కృష్ణయ్య కుటుంబాన్ని టీడీపీ నాయకులు పరామర్శించారు.

Chandrababu: కృష్ణయ్య కుటుంబానికి చంద్రబాబు రూ. 2 లక్షల ఆర్థిక సాయం..

కడప జిల్లా: పులివెందుల నియోజకవర్గంలోని సింహాద్రిపురం మండలం అంకాలమ్మగూడూరులో మూడురోజుల క్రితం హత్యకు గురైన కృష్ణయ్య కుటుంబాన్ని టీడీపీ నాయకులు పరామర్శించారు. ఎస్సీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు ఎమ్ఎస్ రాజు, బిటెక్ రవిలతో పాటు ఇతర నాయకులు పరామర్శించారు. మృతుని భార్య రామాంజనమ్మతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఈ సందర్భంగా కృష్ణయ్య కుటుంబానికి రెండు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం ప్రకటించారు. పులివెందుల ఇంచార్జ్ బిటెక్ రవి మరో లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు.

ఈ సందర్బంగా ఎస్సీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు రాజు మాట్లాడుతూ టీడీపీ మృతుని కుటుంబ సభ్యులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. పోలీసుల సహాయంతోనే ఈ హత్య జరిగిందని ఆరోపించారు. అగ్రవర్ణ కుటుంబాలు దళితుల ఇంటిపై దాడి చేసి పెట్రోల్ పోసి నిప్పంటించారని, సీఎం నియోజకవర్గంలో దళితులపై దాడులు జరగడం.. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యనని టీడీపీ నాయకులు అన్నారు. ప్రభుత్వం కృష్ణయ్య కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఐదు ఎకరాల భూమి, కోటి రూపాయల ఆర్థిక సాయం ఇవ్వాలని ఎమ్ఎస్ రాజు డిమాండ్ చేశారు.

Updated Date - 2023-06-16T15:11:59+05:30 IST