Avinash In Viveka Case : పులివెందులలో హై టెన్షన్.. అవినాష్‌ను అరెస్ట్ చేస్తారా..!?
ABN , First Publish Date - 2023-04-30T08:20:25+05:30 IST
కడప జిల్లా: వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి (YS Avinash Reddy) అరెస్టు (Arrest) అవుతారా? ప్రస్తుతం కడప జిల్లాలో జోరుగా ఇదే అంశంపై చర్చ జరుగుతోంది.
కడప జిల్లా: వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి (YS Avinash Reddy) అరెస్టు (Arrest) అవుతారా? ప్రస్తుతం కడప జిల్లాలో జోరుగా ఇదే అంశంపై చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో పులివెందుల నియోజకవర్గంలో హై టెన్షన్ (High Tension) వాతావరణం నెలకొంది. వివేకా హత్య కేసు (Viveka Murder Case)లో అవినాష్‌ను అరెస్టు చేస్తారనే పుకార్ల నేపథ్యంలో ఆదివారం పులివెందుల నియోజక వర్గంలో గడగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో అవినాష్ పాల్గొనబోతున్నారు. వేంపల్లె మండలంలో ఎంపీ పర్యటించనున్నారు. ఇదే సమయంలో కడప, పులివెందులలో సీబీఐ అధికారులు పర్యటిస్తున్నారు. ఓ వైపు అవినాష్, మరో వైపు సీబీఐ బృందాల పర్యటనతో అసలు ఏం జరుగుతుందోనని కడప జిల్లా వాసుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది.
తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ప్రకంపనలు రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సహ నిందితుడు కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్‌పై (Anticipatary Bail) తెలంగాణ హైకోర్టు, సీజే బెంచ్ (TS High Court, CJ Bench) ఊహించని షాక్‌లు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికిప్పుడు తీర్పు ఇవ్వడం కుదరదని.. జూన్-05కు హైకోర్టు విచారణ వాయిదా వేసింది. అత్యవసరమైతే చీఫ్ కోర్టును అభ్యర్థించాలని అటు అవినాష్ రెడ్డి.. ఇటు వైఎస్ సునీతారెడ్డి లాయర్లకు హైకోర్టు సూచించింది. దీంతో అవినాష్ తరఫు న్యాయవాది సీజేని ఆశ్రయించగా.. ఇప్పటికిప్పుడు విచారణ సాధ్యం కాదని చీఫ్ జస్టిస్ తెలిపారు.
వెకేషన్ బెంచ్ ముందు మెన్షన్ చేసుకోవాలని సీజే స్పష్టం చేశారు. ఈ కేసుపై సుప్రీంకోర్టు సీజేఐ కామెంట్స్ చేశాక ఎందుకు ఒత్తిడి చేస్తున్నారు..? అని తెలంగాణ హైకోర్టు సీజే ఒకింత ఆగ్రహానికి లోనయ్యారు. శుక్రవారం జరిగిన ఈ పరిణామాలతో ఏపీలోని అధికార వైసీపీలో టెన్షన్ మొదలైంది. రెండోరోజు అయినా ముందస్తు బెయిల్‌పై హైకోర్టు నుంచి శుభవార్త వస్తుందని ఆశపడిన వైసీపీ పెద్దలు ఈ తీర్పుతో అవాక్కయ్యారట. సీజే బెంచ్ నుంచి అనుకూలంగా తీర్పు వస్తుందని భావించినా అక్కడా ఎదురుదెబ్బ తగలడంతో.. సీబీఐ ఏం చేయబోతోంది..? ఎప్పుడేం పరిణామాలు చోటుచేసుకుంటాయో అని వైసీపీలో ఆందోళన మొదలైంది.