YS Viveka case: ఏ5 నిందితుడి భార్య స్టేట్‌మెంట్ రికార్డు చేసిన కోర్టు
ABN , First Publish Date - 2023-03-25T14:20:38+05:30 IST
వైఎస్ వివేకా (YS Viveka case) హత్య కేసులో ఏ5 నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి సతీమణి తులసమ్మ స్టేట్ మెంట్‌ను
కడప: వైఎస్ వివేకా (YS Viveka case) హత్య కేసులో ఏ5 నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి సతీమణి తులసమ్మ స్టేట్ మెంట్‌ను పులివెందుల కోర్టు (Pulivendula Court) రికార్డు చేసింది. వివేకా హత్య కేసులో సీబీఐ (CBI) ఏకపక్ష ధోరిణిలో వ్యవహరిస్తోందని.. ఈ హత్యతో తన భర్తకు ఎలాంటి సంబంధం లేదని న్యాయస్థానంలో తులసమ్మ పిటిషన్ వేసింది. వివేకా అల్లుడు రాజశేఖర్ రెడ్డి, బావమరిది శివ ప్రకాశ్ రెడ్డితో పాటు మరో నలుగురిని విచారించాలంటూ తులసమ్మ ప్రైవేటు పిటిషన్ దాఖలు చేసింది. గత ఏడాది ఫిబ్రవరి 21న పులివెందుల కోర్టులో తులసమ్మ ప్రైవేటు కేసు వేసింది. శనివారం ఆమె పిటిషన్‌పై వాంగ్మూలాన్ని నమోదు చేసింది. సాక్షిగా వివేకా పీఏ కృష్ణారెడ్డి స్టేట్‌మెంట్‌ను కూడా ధర్మాసనం రికార్డు చేసింది. తదుపరి విచారణ ఏప్రిల్ 15కు వాయిదా వేసింది.