Share News

NTR Dist.: రాత్రి మున్సిపల్ కార్యాలయంవద్ద కార్మికుల నిరసన..

ABN , Publish Date - Dec 31 , 2023 | 07:27 AM

ఎన్టీఆర్ జిల్లా: నందిగామలో మునిసిపల్ కార్మికుల ఆందోళన కోనసాగుతోంది. ఐదవ రోజులో భాగంగా మున్సిపల్ కార్యాలయం గేట్ వద్ద కార్మికులు ఆందోళన నిర్వహించారు. పర్మినెట్ సిబ్బందితో కాకుండా బయట వ్యక్తులతో పారిశుద్ధ్య పనులు చేయించవద్దని కార్మికులు గేటు వద్ద బైఠాయించారు.

NTR Dist.: రాత్రి మున్సిపల్ కార్యాలయంవద్ద కార్మికుల నిరసన..

ఎన్టీఆర్ జిల్లా: నందిగామలో మునిసిపల్ కార్మికుల ఆందోళన కోనసాగుతోంది. ఐదవ రోజులో భాగంగా మున్సిపల్ కార్యాలయం గేట్ వద్ద కార్మికులు ఆందోళన నిర్వహించారు. పర్మినెట్ సిబ్బందితో కాకుండా బయట వ్యక్తులతో పారిశుద్ధ్య పనులు చేయించవద్దని కార్మికులు గేటు వద్ద బైఠాయించారు. అనంతరం గేటు వద్ద భోజనాలు చేశారు. తమ డిమాండ్లు నెరవేర్చేవరకు ఆందోళన ఆపబోమని స్పష్టం చేశారు. సీఎం జగన్ రెడ్డి తమను మోసం చేశారని మండిపడ్డారు. చలిని సయితం లెక్క చేయకుండా రాత్రి అక్కడే పడుకుని ఆందోళన కొనసాగించారు.

మునిసిపల్ కార్మికులు శనివారం ఉదయం అర్దన్న ప్రదర్శన అననంతరం సాయంత్రం వరకు నిరసన తెలిపారు. సాయంత్రం ప్రవేటు సిబ్బందితో నైట్ పనిచేపీస్తారన్న అనుమానంతో ఇంటికి వెళ్ళకుండా కార్యలయం వద్ద ఆందోళన చేశారు. రాత్రి భోజనం కూడా కార్యాలయం గేటు ముందు పూర్తి చేసిన కార్మికులు.... సమస్యలు పరిష్కరించకుండా ప్రైవేటు వ్యక్తులు పనిచేయడానికి వీలులేదని కార్యాలయం గేటు వద్ద కార్మికులు పడుకున్నారు. కార్యాలయంలో పనిచేసే పర్మినెంట్ ఉద్యోగుల విధులను తాము అడ్డుకోమని, ప్రేవేటు సిబ్బందితో పనిచేయిస్తే ఒప్పుకోమని కార్మికులు స్పష్టం చేశారు. తెల్లవారువరకు కార్యాలయం గేటు వద్ద చలితో, దోమలలో పడుకుని కార్మికులు నిరసన తెలిపారు.

Updated Date - Dec 31 , 2023 | 07:27 AM