Vijayawada: రాజధాని అమరావతి అని గుర్తించిన ఎయిర్ ఇండియా
ABN , First Publish Date - 2023-04-10T11:14:35+05:30 IST
విజయవాడ: అమరావతి ప్రజలకు కాస్త ఆనందం దక్కింది. ఎయిర్ ఇండియా కంపెనీ (Air India Company) ఏపీ రాజధాని అమరావతి (Amaravathi) అని గుర్తించింది.
విజయవాడ: అమరావతి ప్రజలకు కాస్త ఆనందం దక్కింది. ఎయిర్ ఇండియా కంపెనీ (Air India Company) ఏపీ రాజధాని అమరావతి (Amaravathi) అని గుర్తించింది. నిన్నటి వరకు ఢిల్లీ వెళ్లే విమానాల్లో గన్నవరం టూ ఢిల్లీ అని ఎయిర్ ఇండియా పేర్కొనేది. కానీ సోమవారం నుంచి అమరావతి టూ ఢిల్లీ అని వెబ్ సైట్‌లో పేరు మార్చింది. టిక్కెట్ స్టేటస్, ప్రకనలో కూడా అమరావతి టూ ఢిల్లీ, ఢిల్లీ టూ అమరావతి అని ఎయిర్ ఇండియా యాజమాన్యం పేర్లు మార్చింది. దీంతో అమరావతి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎయిర్ ఇండియాలో వచ్చిన మార్పుతో రాష్ట్ర ప్రజలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
గత కొంత కాలంగా ఏపీ రాజధాని ఏదీ? అనే అంశంపై దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ప్రభుత్వంపై సెటైర్లు వేసే పరిస్థితి. విమానాలకు సంబంధించి టిక్కెట్ల విషయంలో కూడా గన్నవరం-ఢిల్లీ, గన్నవరం -చెన్నై, గన్నవరం - హైదరాబాద్ అని మాత్రమే ముద్రించేవాళ్లు. అయితే తాజాగా ఎయిర్ ఇండియా పేర్లు మార్చడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని రైతులు 12వందల రోజులుగా ఉద్యమం చేస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, అన్ని పక్షాలు కూడా అమరావతినే కొనసాగించాలని కోరుతున్న విషయం తెలిసిందే. కేవలం వైసీపీ ప్రభుత్వం మాత్రం ఏపీకి మూడు రాజధానులంటూ మాటమార్చి.. రాష్ట్రంలో రాజధాని లేకుండా చేసింది. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా ప్రకటన అమరావతి వాసులతో పాటు రాష్ట్ర ప్రజలు ఆనందపడే విషయంగా చెప్పుకుంటున్నారు.