AP Minister: కేంద్ర బడ్జెట్ గుడ్‌ బడ్జెట్ అన్న మంత్రి బుగ్గన

ABN , First Publish Date - 2023-02-01T15:16:36+05:30 IST

కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి సంబంధించి ప్రత్యేక అంశాలు ఇంకా తెలియరాలేదని ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు.

AP Minister: కేంద్ర బడ్జెట్ గుడ్‌ బడ్జెట్ అన్న మంత్రి బుగ్గన

విజయవాడ: కేంద్ర బడ్జెట్‌ (Union Budget)లో ఏపీకి సంబంధించి ప్రత్యేక అంశాలు ఇంకా తెలియరాలేదని ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (AP Finance Minister Buggana Rajendranath Reddy) అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడతూ.. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను గుడ్‌బడ్జెట్ అని భావిస్తున్నామన్నారు. అందరికీ ఉపయోగపడే బడ్జెట్‌గా ఉందని తెలిపారు. గత ఏడాది కంటే రూ.3 లక్షల కోట్లు పెరిగి రూ. 45 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టారన్నారు. కేంద్ర బడ్జెట్‌లో రూ.2.5 లక్షల కోట్లు కేపిటల్ ఎక్ప్‌పెండీచర్ పెరిగిందన్నారు. గత బడ్జెట్ తో పోల్చితే ఈ బడ్జెట్‌లో రాష్ట్ర వాటా రూ.10 లక్షల కోట్ల వాటా పెరిగిందన్నారు. రాష్ట్రాలకు వచ్చే పన్ను, పన్నేతర ఆదాయం కలిపి రూ.26 లక్షల కోట్లకు పెరిగిందని మంత్రి అన్నారు.

రాష్ట్రానికి సంబంధించి ఎరువులలో రూ.50 వేల కోట్లు కేటాయింపు తగ్గించారన్నారు. సబ్సిడీ సంబంధించి ఫుడ్‌లో రూ.97 వేలు తగ్గించారని, విద్యకు రూ.13 వేల కోట్లు, విద్యుత్ రూ.25 వేల కోట్లు పెంచారన్నారు. రోడ్లు రవాణాలో పెరుగుదల నమోదైందన్నారు. గ్రామాల్లో పనికి ఆహార పథకం ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులు తగ్గించారని తెలిపారు. ‘‘జల్ జీవన్ మిషన్‌లో రూ.15వేల కోట్లు పెంచారు. యూరియా ,అగ్రికల్చర్ న్యూట్రియన్స్ సబ్సిడీలు తగ్గించారు. బడ్జెట్‌లో జాతీయ రహదారులకు ,రైల్వేలకు నిధులు పెంచారు. వ్యవసాయానికి, పౌర సరఫరాలు కేటాయింపులు తగ్గించారు. ఈ సారి ఏడు ముఖ్యమైన అంశాలు సప్తరుషులపై బడ్జెట్ డిజైన్ చేసినట్లు చెప్పారు. ప్రతి ఒక్కరి అభివృద్దికి లక్ష్యంగా పెట్టుకున్నారు. దేశవ్యాప్తంగా 157 నర్సింగ్ కళాశాలలు పెంచారు. కేంద్ర బడ్జెట్‌లో స్టార్టప్‌లకు ప్రాధాన్యత ఇచ్చారు. పీఎం ఆవాస్ యోజన పథకానికి 66 శాతం నిధులు పెంచారు’’ అని మంత్రి వెల్లడించారు.

కేంద్రానికి ధన్యవాదాలు...

బడ్జెట్ ముందు కేంద్రానికి రాష్ట్రం ఇచ్చిన సలహాలకు కేటాయింపులు చేశారని అందుకు కేంద్ర ప్రభుత్వానికి ఆర్థిక మంత్రి ధన్యవాదాలు తెలియజేశారు. రాష్ట్రంలో సౌర విద్యుత్‌ఉత్పత్తి ప్లాంట్ల కోసం కేంద్ర ప్రభుత్వం అభివృద్దికి పాలసీ తేవాలని కోరగా ఇవాళ ప్రకటించారన్నారు. పీఎం ఆవాస్ యోజన నిధులు పెంచాలన్న ఏపీ విజ్ణప్తిపై సానుకూలంగా స్పందించి నిధులు పెంచారని అన్నారు. అర్బన్ ఇన్ ఫ్రా డెవలప్ ఫండ్ దేశ వ్యాప్తంగా ప్రారంభం కావడం గర్వకారణమని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో అంతర్జాతీయ తరహాలో నైపుణ్య శిక్షణా కేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఎయిర్ పోర్టులు, పోర్టులు, హెలీపాడ్‌లు పెట్టడం వల్ల మనకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఏకలవ్య పాఠశాలల ఏర్పాటు, ఐటీడీఎ, ఆక్వాకల్చర్ బెనిఫిట్స్ ఉపయోగపడతాయని అన్నారు. వేతన జీవులకు పన్ను మినహాయింపు 7 లక్షలకు పెంచడాన్ని రాష్ట్ర ప్రభుత్వం హర్షం వ్యక్తం చేస్తోందన్నారు. సామాన్యులకు టాక్స్ మినహాయింపు ఇవ్వడం వల్ల ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు.

రాజధాని పదం రాజ్యాంగంలో లేదు....

పాలన వికేంద్రీకరణ చేయడమే రాష్ట్ర ప్రభుత్వం విధానమని మంత్రి స్పష్టం చేశారు. ఒకే చోట అభివృద్ది ఉండకూడదనేది ప్రభుత్వ విధానమన్నారు. విశాఖ రాజధాని అని సీఎం జగన్ ప్రకటన చేశారని... సీఎం ఎక్కడ ఉంటే అదే సీఎం పరిపాలన కార్యాలయమని తేల్చిచెప్పారు. రాజధాని అనే పదం రాజ్యాంగంలో ప్రత్యేకంగా ఎక్కడా ప్రస్తావించలేదని మంత్రి బుగ్గన పేర్కొన్నారు.

Updated Date - 2023-02-01T15:20:03+05:30 IST