AP News: ఎన్టీఆర్‌ జిల్లాలో అధికారులపై కేంద్రమంత్రి ఆగ్రహం

ABN , First Publish Date - 2023-06-06T16:00:09+05:30 IST

జిల్లాలోని ఎ.కొండూరులో కేంద్రమంత్రి ప్రవీణ్‌పవార్ పర్యటించారు.

AP News: ఎన్టీఆర్‌ జిల్లాలో అధికారులపై కేంద్రమంత్రి ఆగ్రహం

ఎన్టీఆర్‌: జిల్లాలోని ఎ.కొండూరులో కేంద్రమంత్రి ప్రవీణ్‌పవార్ పర్యటించారు. ప్రధాని నేషనల్ డయాలసిస్ ప్రోగ్రామ్‌ సెంటర్‌ను ఆయన పరిశీలించారు. పేషెంట్లతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అలాగే ఎ.కొండూరులో తాగునీటి సరఫరాపై కేంద్రమంత్రి ఆరా తీశారు. రెండు రోజులకోసారి తాగునీళ్లు వస్తున్నాయని స్థానికులు వాపోయారు. తాగునీటి ఇబ్బందిలేదన్న అధికారులపై కేంద్రమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్ధాలు‌ చెబుతారా అంటూ అధికారులను మంత్రి నిలదీశారు. ఎ.కొండూరులో డయాలసిస్ వ్యాధిగ్రస్తులు పెరుగుతుంటే అధికారులేం చేస్తున్నారని కేంద్రమంత్రి ప్రవీణ్‌పవార్ ప్రశ్నించారు.

Updated Date - 2023-06-06T16:00:09+05:30 IST