AP News: సీఎం జగన్ దంపతులపై పట్టాభి సీరియస్
ABN , First Publish Date - 2023-04-22T16:14:23+05:30 IST
సీఎం జగన్ (CM Jagan) దంపతులపై టీడీపీ (TDP) అధికార ప్రతినిధి పట్టాభి (Tdp Pattabhi) సీరియస్ అయ్యారు.
అమరావతి: సీఎం జగన్ (CM Jagan) దంపతులపై టీడీపీ (TDP) అధికార ప్రతినిధి పట్టాభి (Tdp Pattabhi) సీరియస్ అయ్యారు. హత్య వెనుక సీఎం జగన్ కుటుంబం పాత్ర ఉందని ఆయన ఆరోపించారు. హూ కిల్డ్ బాబాయ్ అనే ప్రశ్నకు సీఎం జగన్ అనే సమాధానం లభిస్తోందన్నారు. వైఎస్ వివేకా హత్య కేసులో అరెస్టు అయిన వారు కేవలం పాత్రధారులేనన్నారు. వైఎస్ వివేకా హత్య కేసు సూత్రధారులు తాడేపల్లి ప్యాలెస్సులో ఉన్నారని వ్యాఖ్యానించారు. వివేకా హత్య కేసులో వైఎస్ జగన్.. ఆయన సతీమణి భారతి (Bharathi) పాత్ర గురించి సీబీఐ ఆరా తీయాల్సి ఉంటుందన్నారు. సీబీఐ (CBI) జగన్ దంపతులకు సీబీఐ నోటీసివ్వాల్సిన అవసరం ఉందన్నారు. భారతి వ్యక్తిగత సహయకుడు నవీనుకు వైఎస్ అవినాష్ రెడ్డి (Avinash Reddy) ఎందుకు ఫోన్ చేశారు..? ఏం మాట్లాడారు..?, సీఎం జగన్.. భారతీ ఇచ్చిన పని పూర్తి చేశామని చెప్పడానికి అవినాష్ పోన్ చేశారా..?, భారతి తండ్రి ఈసీ గంగిరెడ్డి (Gangi Reddy) ఆస్పత్రిలో పని చేసే ప్రకాష్ రెడ్డి వివేకా పార్థివ దేహానికి కుట్లు వేయడానికి వెళ్లారా..? లేదా..?, ఈసీ గంగిరెడ్డి ఆస్పత్రిలో పని చేసే ప్రకాష్ రెడ్డి ఎందుకు కుట్లు వేశారు..? అని ఆయన ప్రశ్నించారు. వివేకా హత్య తర్వాత అక్కడికి వెళ్లిన వారందరూ భారతి రెడ్డి మేనమామలు లచ్చమ్మ సంతానమే వెళ్లిందన్నారు.
భారతీ పెద్దనాన్న కొడుకు వరుసకు అన్న అయిన ఈసీ సురేంద్రనాధ్ రెడ్డి ఎందుకు వెళ్లారు..?, సురేంద్రనాధ్ రెడ్డికి ఆర్టిక్చర్ యూనివర్శిటీ రిజిస్ట్రార్ పదవి ఎందుకిచ్చారు..? అని ప్రశ్నించారు. జగన్ సీఎం అయ్యాక వివేకా హత్య కేసు విచారిస్తున్న సిట్ స్థాయిని తగ్గిస్తూ ఎస్పీ అధ్యక్షతన సిట్ వేశారని పేర్కొన్నారు. సిట్ స్థాయిని సీఎం జగన్ ఎందుకు తగ్గించారు..?, వివేకా హత్య విషయంలో సీబీఐ ఎంక్వైరీ అక్కర్లేదని గతంలో వేసిన పిటిషన్ను ఎందుకు వెనక్కు తీసుకున్నారు..?, అభిషేక్ మహంతి ఉదయ్ కుమార్ రెడ్డిని విచారణకు తీసుకెళ్తుంటే ఎందుకు వదిలిపెట్టమని ఆదేశించారు..? ఆ తర్వాత అభిషేక్ మహంతిని లాంగ్ లీవుపై ఎందుకు పంపారు..?, అవినాష్ రెడ్డికి.. భాస్కర్ రెడ్డికి సహకరించిన సీఐ శంకరయ్య సస్సెండ్ చేస్తే ఎందుకు మళ్లీ విధుల్లోకి తీసుకున్నారు..?, అప్పటి డీజీపీ గౌతమ్ సవాంగ్ దగ్గరకు అవినాష్ రెడ్డిని ఎందుకు పంపించారు..?, వైఎస్ వివేకా హత్య కేసు విచారణ జాప్యం చేయమని అవినాష్ రెడ్డితో చెప్పించారా..?, నిందితుణ్ని డీజీపీ దగ్గరకు ఎలా పంపిస్తారు..?’’ అని పట్టాభి ప్రశ్నించారు. వైఎస్ వివేకాను అడ్డు తొలగించిన మర్నాడే కడప లోక్‌సభ అభ్యర్థిగా అవినాష్ రెడ్డి పేరును ప్రకటించారని గుర్తుచేశారు. అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి వంటి వారు జగన్ చేతులో తోలు బొమ్మలేనని విమర్శించారు. సీఎం జగనుకు విచారించేందుకు సీబీఐ కచ్చితంగా నోటీసిలివ్వాలని డిమాండ్ చేశారు. జగన్ దంపతులను విచారిస్తేనే వివేకా హత్యకు సంబంధించిన అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు. భవిష్యత్తులో జగన్ కాపురం చంచల్ గూడా జైలేనన్నారు.