NTR Dist.: పెనుగంచిప్రోలులో దారుణం

ABN , First Publish Date - 2023-02-04T13:16:34+05:30 IST

యన్టీఆర్‌ జిల్లా: పెనుగంచిప్రోలు గుమ్మడిదుర్రు గ్రామంలో దారుణం జరిగింది. ఓ పుత్ర రత్నం డబ్బు ఇవ్వలేదని కన్న తండ్రి గింజుపల్లి కోటయ్యకు తలకొరివి పెట్టేందుకు నిరాకరించాడు.

NTR Dist.: పెనుగంచిప్రోలులో దారుణం

యన్టీఆర్‌ జిల్లా: పెనుగంచిప్రోలు గుమ్మడిదుర్రు గ్రామంలో దారుణం జరిగింది. ఓ పుత్ర రత్నం డబ్బు ఇవ్వలేదని కన్న తండ్రి గింజుపల్లి కోటయ్యకు తలకొరివి పెట్టేందుకు నిరాకరించాడు. దీంతో కుమార్తె విజయలక్ష్మి తండ్రికి అంతిమ సంస్కారాలు నిర్వహించి కన్న రుణం తీర్చుకుంది. కోటి రూపాయల ఆస్తిలో కోటయ్య రూ. 70 లక్షలు కొడుక్కు ఇచ్చారు. మిగిలిన రూ. 30 లక్షలు తన వద్ద ఉంచుకోవడంపై కొడుకు తండ్రితో ఘర్షణ పడ్డాడు.

ఆస్తి వివాదాలతో కొడుకు తండ్రి కోటయ్యను పట్టించుకోలేదు. దీంతో గత ఆరేళ్లుగా ఆయన కుమార్తె వద్ద ఉంటున్నారు. అనారోగ్యానికి గురైన కోటయ్య శుక్రవారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న కొడుకు తండ్రి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లి ఖర్మకాండ చేసేందుకు నిరాకరించాడు. తండ్రి వద్ద ఉన్న డబ్బు ఇస్తేనే అంతిమసంస్కారాలు చేస్తానని పట్టుపట్టాడు. కనీసం చూసేందుకు కూడా రాకపోవడంతో తండ్రికి కర్మకాండలు అన్నీ కుమార్తె విజయలక్ష్మి పూర్తి చేసింది. కొడుకు నిర్వాకంపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Updated Date - 2023-02-04T17:02:27+05:30 IST