Ramakrishna: ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోపై కోర్టుకు వెళతాం
ABN , First Publish Date - 2023-01-03T12:22:42+05:30 IST
ర్వాలీ, సభలు, సమావేశాలు నిర్వహించవద్దని ప్రభుత్వం చెప్పడం విడ్డురంగా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు.
విజయవాడ: ర్వాలీ, సభలు , సమావేశాలు నిర్వహించవద్దని ప్రభుత్వం చెప్పడం విడ్డురంగా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ (CPI Leader Ramakrishna) అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. 2023 నూతన కానుకగా రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసిందని విమర్శించారు. ప్రతిపక్ష పార్టీలు ధర్నా, నిరసనలు చేయకుండా చేయడానికే జగన్ (AP CM Jagan) ఈ జీవో ఇచ్చారన్నారు. ప్రతిపక్షంలో ఉండగా జగన్ ర్వాలీ, సభలు నిర్వహించలేదా అని ప్రశ్నించారు. జగన్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కందూరు, గుంటూరులో జరిగిన ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు (TDP Chief Chandrababu naidu) సీఎంగా ఉన్న సమయంలో పుష్కరాలలో ఒక ఘటన జరిగిందని.. అందుకోసం పుష్కరాలు రద్దు చేశారా అని ప్రశ్నించారు. జగన్ మోహన్ రెడ్డిపై అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారన్నారు. దానిని తొలగించేందుకే ఈ పనికి మాలిన జీవో ఇచ్చారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం చేస్తున్న తప్పుడు పనులపై ఆందోళనలు, నిరసనలు చేయనున్నట్లు చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన జీవోపై కోర్టుకు వెళ్లనున్నట్లు రామకృష్ణ అన్నారు.