Ramakrishna: ఏపీలో కూడా బీసీ జనగణన చేపట్టాలి
ABN , First Publish Date - 2023-01-22T07:38:26+05:30 IST
ఏపీలో కూడా బీసీ జనగణన చేపట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు.
అమరావతి: ఏపీలో కూడా బీసీ జనగణన చేపట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ (CPI Leader Ramakrishna) డిమాండ్ చేశారు. బీహార్ రాష్ట్రంలో బీసీ జనగణనకు వ్యతిరేకంగా హిందూసేన వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించిందన్నారు. రాష్ట్రస్థాయిలోనే తేల్చుకోవాలని సుప్రీంకోర్టు చెప్పిందని తెలిపారు. తదనుగుణంగా బీహార్ ప్రభుత్వం జనాభాలో అత్యధిక సంఖ్యలో ఉన్న బీసీల జనగణన చేపట్టిందని చెప్పుకొచ్చారు. బీహార్ తరహాలోనే ఏపీలో కూడా బీసీల జనగణన చేపట్టాలని డిమాండ్ చేస్తున్నామని రామకృష్ణ పేర్కొన్నారు.