Ramakrishna: ఓ మూర్ఖుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు: రామకృష్ణ
ABN , First Publish Date - 2023-02-19T13:55:44+05:30 IST
విజయవాడ: జగన్ ప్రభుత్వం (Jagan Govt.) తీసుకువచ్చిన జీవో నెంబర్1 (GO 1)పై ఎన్ని నిరసనలు చేసినా సర్కారులో కనీసం చలనం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ (Ramakrishna) విమర్శించారు.
విజయవాడ: జగన్ ప్రభుత్వం (Jagan Govt.) తీసుకువచ్చిన జీవో నెంబర్1 (GO 1)పై ఎన్ని నిరసనలు చేసినా సర్కారులో కనీసం చలనం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ (Ramakrishna) విమర్శించారు. ప్రజస్వామ్య హక్కులను కాలరాసే జీవో నంబర్ 1ను రద్దు చేయాలని కోరుతూ ఆదివారం పోరాట ఐక్య వేదిక ఆధ్వర్యంలో మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం (Makineni Basavapunnaya Science Centre)లో రాష్ట్ర స్థాయి సదస్సు (State Level Conference) జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రామకృష్ణ మాట్లాడుతూ జీవో నెంబర్ 1ను సవాల్ చేస్తూ హైకోర్టుకు పోతే గతంలో స్టే ఇచ్చిందని, తీర్పు వచ్చేవరుకైనా ప్రభుత్వం జీవో నెంబర్ 1 అమలు నిలుపు చేయలేదని మండిపడ్డారు. యుటీఎఫ్ టీచర్లు (UTF Teachers) గన్నవరంలో ప్రైవేటు స్థలంలో ధర్నా చేస్తే.. ప్రభుత్వం అరెస్టులతో అడ్డుకుందని, ఓ మూర్ఖుడు ముఖ్యమంత్రిగా ఉన్నారని, సీఎం జగన్ (CM Jagan) ఎవరినీ లెక్కచేయటం లేదని రామకృష్ణ దుయ్యబట్టారు.
తూర్పుగోదావరి జిల్లా, అనపర్తిలో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) పర్యటన రెండు రోజులు ప్రశాంతంగా జరిగిందని, మూడో రోజు మాత్రం అడ్డుకునేందుకు ప్రయత్నించారని రామకృష్ణ విమర్శించారు. అనపర్తిలో చేతగాని దద్దమ్మల్లా అధికార పార్టీ వ్యవహరించిందని ఎద్దేవా చేశారు. పోలీసులు ఖాకీ డ్రెస్ వేసుకున్న పక్కా జీతగాళ్లని.. ఐపీఎస్ అధికారులు ..సీఎం జగన్‌కు జీతగాళ్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తాము పట్టిన కందేలుకు మూడే కాళ్లు అన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. జీవో నెంబర్1ను నిరసిస్తూ త్వరలో ఛలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహిస్తామని, అసెంబ్లీ పెద్ద ఎత్తున చేసే నిరసన దద్దరిల్లాలని, అన్ని ప్రాంతాల నుంచి అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున తరలిరావాలని రామకృష్ణ పిలుపిచ్చారు.